Share News

2029 ఎన్నికల్లో తేల్చుకుందాం

ABN , Publish Date - Aug 14 , 2026 | 12:13 AM

2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి బలబలాలు ఏమిటో తేల్చుకుందామని మాజీ ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డికి రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

2029 ఎన్నికల్లో తేల్చుకుందాం
సీసీ రోడ్లను ప్రారంభిస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

కాటసానికి సవాల్‌ విసిరిన బీసీ జనార్దన్‌రెడ్డి

ఇంటింటికీ టీడీపీలో మంత్రి

బనగానపల్లె, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి బలబలాలు ఏమిటో తేల్చుకుందామని మాజీ ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డికి రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. గురువారం బనగానపల్లె మండలంలోని చెర్వుపల్లె గ్రామంలో రూ.70 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి బీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ జెండాను ఆవిష్కరించి ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొని టీడీపీ కరపత్రాలు మంత్రి పంపిణీ చేశారు. మంత్రి బీసీ మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు పింఛన్లు, ఉచిత బస్సు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. పేదల ఆకలితీర్చేందుకు అన్నక్యాంటీన్‌ ఏర్పాటు చేశామన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాజధాని అమరావతిని, పోలవరాన్ని పరుగులు పెట్టించామన్నారు. రాయలసీమకు ద్రోహం చేసింది జగన్‌ అన్నారు. నందమూరి తారకరామారావు, చంద్రబాబు హయంలోనే ఎస్సార్బీసీ, గోరుకల్లు, హంద్రీనీవా ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. జగన్‌ హయంలో గ్రూప్‌ పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు సిట్‌ తేల్చిందన్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసానికి గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని, 2029 ఎన్నికల్లో ఎవరు ఏమిటో, ప్రజలు ఎవరికి సమాధి కడుతారో చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అఽధ్యక్షుడు పీవీ. కుమార్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ మద్దిలేటి, శరత్‌, రామకృష్ణ, రామసుబ్బయ్య, టంగుటూరు శ్రీనయ్య, మార్కెట్‌యార్డు డైరక్టర్‌ గుండం మల్లిఖార్జునరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలాటం ఆకట్టుకుంది.

ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించండి

ప్రజాసమస్యలను అధికారులు త్వరిత గతినపరిష్కరించి ప్రజ ల మన్ననలను పొందాలని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సూచించారు. గురువారం బనగానపల్లె మంత్రి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల, టీడీపీ నాయకులు, కార్యకర్తల అర్జీలను మంత్రి స్వయంగా స్వీకరించారు. పలు అర్జీలను స్వయంగా చదివి సంబంఽధిత అధికారులకు ఫోన్‌ చేసి పరిష్కరించారు.

Updated Date - Aug 14 , 2026 | 12:13 AM