Share News

పర్యావరణాన్ని కాపాడుకుందాం

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:27 PM

మొక్కలు నాటి సంరక్షించి పర్యావరణాన్ని కాపాడుకుందామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

పర్యావరణాన్ని కాపాడుకుందాం
యాగంటిరోడ్డులో బైపాస్‌ రోడ్డుకు ఇరు వైపులా మొక్కలు నాటుతున్న మంత్రి బీసీజనార్దన్‌రెడ్డి

రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): మొక్కలు నాటి సంరక్షించి పర్యావరణాన్ని కాపాడుకుందామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పర్యావరణ దినోత్సవం సందర్భంగా బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి బీసీతో పాటు వందలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అధికారులు పాదయాత్రగా భారీ ర్యాలీ నిర్వహించారు. ‘నో వెహికల్‌ డే’ నినాదంతో మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి పాదయాత్రగా వెళ్లారు. పట్టణంలోని ఆస్థానం రోడ్డు, పెట్రోల్‌బంకు, కొత్తబస్టాండ్‌ మీదుగా యాగంటిపల్లె రహదారిలోని బైపా్‌సరోడ్డు కిరువైపులా భారీగా మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌, మంత్రి నారాలోకేశ్‌ సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వైపీపీ 5 ఏళ్ల పాలనలో ఒక్కమొక్క కూడా నాటిన దాఖలాలు లేవన్నారు. బనగానపల్లెలో టీడీపీ నాయకురాలు బీసీ ఇందిరమ్మ ‘నా బనగానపల్లె-నా ఆరోగ్యం’ కార్యక్రమం కింద ప్రజలను చైతన్యం చేసి పట్టణంలో ప్లాస్టిక్‌ 70 శాతం లేకుండా చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బనగానపల్లె ఈఓ తిరుమలేశ్వర్‌రెడ్డి, టీడీపీ నాయకులు వంగల పరమేశ్వరరెడ్డి, బురానుద్దీన్‌, టంగుటూరు శీనయ్య, కాశీంభాష, తులసిరెడ్డి కైప రఘునాథరెడ్డి, అమరనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2026 | 11:27 PM