Share News

మలేరియా రహిత నగరంగా మార్చుదాం: కమిషనర్‌

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:56 PM

నగరాన్ని మలేరియా రహితంగా మార్చుదామని కార్పొరేషన కమిషనర్‌ చల్లా ఓబు లేసు పిలుపునిచ్చారు.

మలేరియా రహిత నగరంగా మార్చుదాం: కమిషనర్‌
ర్యాలీని ప్రారంభిస్తున్న కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): నగరాన్ని మలేరియా రహితంగా మార్చుదామని కార్పొరేషన కమిషనర్‌ చల్లా ఓబు లేసు పిలుపునిచ్చారు. శనివారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్స్‌ కాలనీలో నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభిం చారు. కమిష నర్‌ మాట్లాడుతూ నిల్వ ఉన్న నీటిలో మలేరియాను వ్యాప్తి చేసే ఆడ ఎనోఫిలిస్‌ దోమలు పెరుగుతాయన్నారు. దోమల కాటుకు గురికాకుండా ఉండేందుకు ఇళ్లల్లో కిటికీలు, గుమ్మాలకు దోమ ల జాలీలు అమర్చుకోవాల న్నారు. అంతకుముందు కమిషనర్‌ పలు ప్రాంతాలలో పారిశుధ్య పను లను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి ఎం.రఘు, సీనియర్‌ ఎంటమాలజిస్టు వెంకటేశ్వర్లు శానిటేషన ఇనస్పెక్టర్‌ హుస్సేన పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 11:56 PM