బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం
ABN , Publish Date - Feb 06 , 2026 | 11:41 PM
ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటిలో ఈనెల 14వ తేదీ నుంచి నిర్వహిం చనున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలను అధికారులు, పాలకవర్గ సభ్యు లు కలసికట్టుగా విజయవంతం చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటిలో ఈనెల 14వ తేదీ నుంచి నిర్వహిం చనున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలను అధికారులు, పాలకవర్గ సభ్యు లు కలసికట్టుగా విజయవంతం చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం యాగంటి క్షేత్రం లో ఆలయ చైర్మన్ మౌళీశ్వరరెడ్డి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ డి.పాండురంగారెడ్డి, అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలం, మహానంది తర్వాత యాగంటి క్షేత్రానికి ఎంతో పురాతన ప్రాశస్థ్యం ఉందన్నా రు. కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల నుంచి భక్తులు యాగంటికి వస్తుంటారన్నారు. భక్తులకు దర్శనం కల్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సొంత నిధులతో భక్తులకు లడ్డూ ప్రసాదాలు అందిస్తామని మంత్రి బీసీ తెలిపారు. అదనపు బస్సులను నడపా లని డీఎం శశిభూషణ్‌ను మంత్రి ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో నరసింహులు, తహసీల్దారు నారాయణరెడ్డి, పాలకవర్గ సభ్యులు శ్రీరాములు, తిరుమలయ్య, జక్కు సురేశ్, రామశేఖర్, భరతుడు, టీడీపీ నాయకులు వంగల పరమేశ్వరరెడ్డి, అమరనాథ్‌రెడ్డి, బత్తుల బాలిరెడ్డి పాల్గొన్నారు.