Share News

మహానాడును విజయవంతం చేద్దాం

ABN , Publish Date - May 22 , 2026 | 12:02 AM

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడును విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌరుచరిత, గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.

మహానాడును విజయవంతం చేద్దాం
మాట్లాడుతున్న గౌరు దంపతులు

టీడీపీ శ్రేణులకు గౌరు దంపతుల పిలుపు

కల్లూరు, మే 21 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడును విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌరుచరిత, గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. గురు వారం మాధవీనగర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ శ్రేణులతో గౌరు దంపతులు సమీక్షా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న మహానాడును జయప్రదం చేయా లన్నారు. నియోజకవర్గంలోని కల్లూరు, గడివేముల, పాణ్యం, ఓర్వకల్లు, కల్లూరు అర్బన 16వార్డుల టీడీపీ నాయకులు పెద్దఎత్తున హాజరై విజయ వంతం చేయాలని కోరారు.

కూటమి ప్రభుత్వంలో దళితులకు భరోసా: గౌరు చరిత

కూటమి ప్రభుత్వంలో దళితులకు సముచిత స్థానం కల్పించి భరోసా కల్పిస్తున్నామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో దళితులు నరక యాతన పడ్డారన్నారు. అనంతరం 33వ వార్డులోని ఎనటీఆర్‌ విగ్రహం నుంచి ఇందిరమ్మ కట్ట వరకు ర్యాలీ నిర్వ హించి, కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. గౌరు చరిత మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ డాక్టర్‌ సుధాకర్‌ హత్య, ఎమ్మెల్సీ అనం తబాబు డైవ్రర్‌ సుబ్ర హ్మణ్యంలపై హత్యలే నిదర్శనమన్నారు. కార్యక్ర మంలో ఏపీ విశ్వబ్రా హ్మణ కార్పొరేషన చైర్‌పర్సన కె.పార్వతమ్మ, టీడీపీ నాయకులు పీయూ.మాదన్న, ఎన్వీ.రామకృష్ణ, ప్రభాకర్‌యాదవ్‌, బి.నాగిరెడ్డి, ఎస్‌.ఫి రోజ్‌, కాసాని మహేష్‌గౌడ్‌, పర ్ల శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2026 | 12:02 AM