మే డే స్ఫూర్తితో పోరాడుదాం
ABN , Publish Date - May 02 , 2026 | 12:26 AM
మే డే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని కార్మిక సంఘాల నాయ కులు పిలుపునిచ్చారు. శుక్రవారం మే డేను పురస్కరించుకుని సీఐ టీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాలలో జెం డాలను ఎగురవేశారు.
కార్మిక సంఘాల నాయకుల పిలుపు
కర్నూలు న్యూసిటీ, మే 1(ఆంధ్రజ్యోతి): మే డే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని కార్మిక సంఘాల నాయ కులు పిలుపునిచ్చారు. శుక్రవారం మే డేను పురస్కరించుకుని సీఐ టీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాలలో జెం డాలను ఎగురవేశారు. ఇందిరాగాంధీనగర్‌లోని సీపీఎం జిల్లా కార్యాలయం సుందరయ్య భవన ముందుగా ఉన్న సుందరయ్య విగ్రహనికి సీపీఎం జిల్లా కార్య దర్శి డి.గౌస్‌దేశాయ్, జిల్లా కార్యదర్శివర్గసభ్యులు పి.నిర్మల, పీఎస్. రాధాక్రిష్ణ, ఎండి.ఆనంద్‌బాబు. టి.రాముడు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సీపీఎం జెండాను గౌస్‌దేశాయ్ ఎగువేశారు. స్థానిక ఇంద్రజిత గుప్తా భవనంలో సీనియర్ నాయకులు ఎన.మనోహర్ మాణిక్యం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు జి.చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర కార్యదర్శి జే.లలితమ్మ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.మునెప్పలు మాట్లాడారు. జిల్లా కార్యదర్శి నక్కి లెనినబాబు, సీపీఐ నగర కార్యదర్శి పి.రామక్రిష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు కలెక్టరేట్: మే డే స్ఫూర్తితో కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించాలని భారత కార్మిక సంఘాల సమైఖ్య (ఐఎఫ్ టీయూ) నగర అధ్యక్షులు సురేష్ నాయక్ పిలుపునిచ్చారు. నగరంలో శుక్రవారం నంద్యాల చెక్‌పోస్టు, సి.క్యాంపు సెంటర్, శకుంతల కల్యాణ మండపం, గోకారి కాలనీ, నంద్యాల రోడ్డు ఐదు సెంటర్లలో ఐఎఫ్‌టీయూ సుత్తి కొడవలి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్ర మంలో సురేష్ నాయక్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి వెంకటస్వామి, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కే.భాస్కర్, మనోహర్, రవి, మల్లికార్జున, మోహనబాబు, వంశీ పాల్గొన్నారు.
కర్నూలు హాస్పిటల్: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆసుపత్రి ఆవరణంలోని యూనియన ఆఫీసు వద్ద ఈ వేడుకలకు ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.మునెప్ప హాజరై జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన కర్నూలు జీజీహెచ అధ్యక్షుడు ఎన.బాలు నాయక్, నాయకులు శశిరెడ్డి, సుశీలమ్మ, భాగ్యమ్మ, ఉరుకుందయ్య పాల్గొన్నారు.
కల్లూరు: కల్లూరు మండల వ్యాప్తంగా మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పందిపాడు, ముజఫర్‌నగర్, ఇండస్ర్టీయల్ ఏస్టేట్, కల్లూరు, రాఘవేంద్రనగర్, శరీననగర్‌లో సీపీఎం, సీఐటీయు నాయకులు సీహెచ.సాయిబాబా, సుధాకరప్పల ఆధ్వర్యంలో ఆటో, హ మాలీ, భవన నిర్మాణ కార్యాలయాల్లో అరుణ పతాకం ఆవిష్కరిం చారు.
కోడుమూరు: పట్టణంలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో మేడే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రజెండాను ఆవిష్కరించి పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీ ఎం, సీపీఐ నాయకులు గఫూర్‌మియా, వీరన్న, మద్దిలేటి, శ్రీనివాసులు, శేషుకుమార్, లెనిన్, రాముడు పాల్గొన్నారు.
గూడూరు: మండలంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సీఐటీయూ కార్యాలయం ముందు మే డే సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దివాకర్ జెండాను ఆవిష్కరించారు. అలాగే బస్టాండ్ సెంటర్‌లో హమాలీ, ఆటో కార్మికులు ఏర్పాటు చేసిన జెండాలను సీఐటీయూ డివిజన కార్యదర్శి జే మోహన ఆవిష్కరించారు.
ఓర్వకల్లు: మండల కేంద్రమైన ఓర్వకల్లులో మేడే సందర్భంగా సీఐటీయూ అధ్యక్ష కార్యదర్శులు షాజహాన, శ్రీధర్, సుధాకర్ జెండాను ఆవిష్కరించారు. నాయకులు నాగేశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు, రంగస్వామి, బుగ్గ రాముడు, శేషాద్రి, నాగమ్మ, తిమ్మక్క, లలితమ్మ పాల్గొన్నారు.