Share News

అంబేడ్కర్‌ ఆశయాలు కొనసాగిద్దాం

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:13 AM

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలు కొనసాగిద్దామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.

అంబేడ్కర్‌ ఆశయాలు కొనసాగిద్దాం
అంబేడ్కర్‌ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రి టీజీ భరత

ఆయన సేవలు మరువలేనివి

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత

అంబేడ్కర్‌కు పలువురి ఘన నివాళి

కర్నూలు రూరల్‌, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): డా.బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలు కొనసాగిద్దామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. మంగళవారం కర్నూలు ఆర్టీసీ డిపో-1లో నిర్వహించిన అంబేడ్కర్‌ 135వ జయంతి వేడుకలకు మంత్రి ముఖ్యఅతిధిగా హాజరై అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రీజినల్‌ మేనేజర్‌ శ్రీనివాసులు, డీఎం సుధారాణి, నాగభూపాల్‌, దీప్తిసుజన, కండక్టర్లు, డ్రైవర్లు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ ఆశయ సాధనే లక్ష్యం: ఎంపీ బస్తిపాటి

కర్నూలు అర్బన్‌ : డా. బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాల సాధన కోసమే తెలుగుదేశం పార్టీ నిర్మాణం జరిగిందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. నగరంలోని పాత బస్టాండ్‌ సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఆదర్శప్రాయుడు అంబేడ్కర్‌: ఎమ్మెల్యే గౌరు చరిత

కల్లూరు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆదర్శనీ యుడని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. 33వ వార్డులో అంబే డ్కర్‌ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన చైర్‌పర్సన కె.పార్వతమ్మ, టీడీపీ నాయకులు ఎన్వీ రామకృష్ణ, ఎస్‌ ఫిరోజ్‌, ఆకెపోగు వెంకటస్వామి, టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ అధికార ప్రతినిధి చిన్న మారెన్న, సంపతి లక్ష్మీరెడ్డి, కాసాని మహే్‌షగౌడ్‌, జి.గంగాధర్‌గౌడ్‌, నాయకులు కె.చెన్న య్య, నాగరాజు యాదవ్‌ పాల్గొన్నారు.

సమాజాభివృద్ధికి కృషి చేయాలి : ఎమ్మెల్యే దస్తగిరి

గూడూరు: ప్రతి ఒక్కరూ అంబేడ్కర్‌ ఆలోచనలను అనుసరించి సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పిలుపు నిచ్చారు. గూడూరులో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు కె రామాంజనేయులు, సింగిల్‌విండో డైరెక్టర్‌ రేమట వెంకటేష్‌, పౌలు పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా..

కోడుమూరు/కర్నూలు కల్చరల్‌/కలెక్టరేట్‌/ న్యూసిటీ/ కల్లూరు/ ఓర్వకల్లు/ కోడుమూరు రూరల్‌ : జిల్లా వ్యాప్తంగా అంబేడ్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. విద్యుతశాఖ ఎస్‌ఈ ఆర్‌.ప్రదీ్‌పకుమార్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అకౌంట్స్‌ ఆపీసర్‌ చిన్న రాఘవులు, టెక్నికల్‌ ఈఈ మహేవ్వరరెడ్డి, ఏడీఈ విజయభాస్కర్‌ పాల్గొన్నారు. కోడుమూరు మండలంలోని వర్కూరులో ఎంపీడీవో రాముడు ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్యాలకుర్తిలో ఉగాది వెంకటేశ్వర్లు, రంగన్న యాదవ్‌ అధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. కర్నూలు బార్‌ అసోసియేషన అధ్యక్షుడు చంద్రుడు ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని న్యాయవాదులు ఘనంగా నివాళులర్పిం చారు. సీనియర్‌ న్యాయవాది వై.జయరాజు, కే.ఓంకార్‌, ఏ.మాధన్న, ఎన.సుబ్బయ్య, బీఎస్‌ రవికాంత ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక అశోక్‌నగర్‌లో అంబేడ్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక లేబర్‌ కాలనీలో జయంతి ఉత్సవాలను ఐఏఎల్‌ నాయకుడు, న్యాయవాది బీఎస్‌ రవికాంత ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిం చారు. మాజీ కార్పొరేటర్‌ బి.సుంకన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. టీడీపీ నగర అధ్యక్షులు రవికుమార్‌ అంబేడ్కర్‌ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు. పంచాయతీరాజ్‌ కార్యాలయంలో పంచాయతీరాజ్‌ కార్యనిర్వాహక ఇంజనీరు మహేశ్వ రరెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి ఆర్పించారు. మునగాలపాడులో అంబేడ్కర్‌ నూతన విగ్రహాన్ని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆవిష్కరించారు. కోడుమూరు పట్టణంలో, సి.బెళగల్‌ మండలంలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలను అధికారులు, వివిధ పార్టీ నాయకులు, స్వచ్చంధ సంఘాలు ఆధ్వర్యంలో నిర్వహించారు. కర్నూలు మార్కెట్‌ కమిటీ సెలక్షన గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మి ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ జయంతిని నిర్వహించారు.

ఫ ఉమ్మడి కర్నూలు జిల్లా అండ్‌ కర్నూలు సిటీ లేడీస్‌, జెంట్స్‌ టైలర్స్‌ అసోసియేషన అధ్యక్షుడు ఓసీఎం రంగా ఆధ్వర్యంలో అసోసియేషన ప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అమర్నాథ్‌ రెడ్డి, నరసింహులు, రామకృష్ణ, శేఖర్‌, సత్యం, శ్రీరాములు యాదవ్‌, కరీం, సురేష్‌, రాజేశ, మహబూబ్‌ బాషా తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆ సంస్థ కార్యదర్శి కె.ప్రకాష్‌ అధ్యక్షతన నివాళులర్పించారు.

ఫ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్‌ అసోసియేషన కార్యాలయంలో అం బేడ్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. డీఆర్‌డీఏ-సెర్ప్‌ ఆధ్వ ర్యంలో అంబేడ్కర్‌ 135వ జయంతి సందర్బంగా కార్యాలయ అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి, ఏపీడీ అనిల్‌ కుమార్‌, డీపీఎం పాల్గొన్నారు. కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డా.కే.చిట్టినరసమ్మ అంబేడ్కర్‌ చిత్రపటానికి ప్రిన్సిపల్‌ పూల మాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఇనచార్జి డీఎంహెచవో డా.ఉమాదేవి, జిల్లా మాస్‌ మీడియా అధికారి ఎన.ప్రకా్‌షరాజ్‌ పాల్గొని డా.అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. స్థానిక ఏ.క్యాంపులోని మైఫర్‌ కళాశాలలో అంబేడ్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించగా వైస్‌ ప్రిన్సిపాల్‌ సురేష్‌, భాస్కర్‌ అధ్యాపకులు పాల్గొన్నారు. స్థానిక పాతబస్టాండులోని భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహానికి కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కేసీ నాగన్న, జనరల్‌ సెక్రటరీ రమేష్‌, వర్కింగ్‌ ప్రెసిడెంటు కృష్ణమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రోజా మహిళా ఐక్య సంఘం ఆధ్వర్యంలో రోజావీధిలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఫ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి డీసీసీ అధ్యక్షుడు బి.క్రాంతినాయుడు పూలమా లలు వేసి నివాళి అర్పించారు. మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌ బాబు పాల్గొ న్నారు. ఆర్‌యూలో ఉపకులపతి వి. వెంకట బసవ రావు ఏర్పాటుచేసిన పది అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని రెక్టార్‌ ఎన టీకే నాయక్‌, రిజిసా్ట్రర్‌ విజకుమార్‌ నాయుడుతో కలిసి ఆవిష్కరించారు.

ఫ టీడీపీ నగర ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కాశపోగు గిడ్డన్న అధ్యక్షతన పాత బస్టాండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళి అర్పిం చారు. డీవీఎంసీ సభ్యులు గొందిళ్ల మాలతి, పోతురాజు శివ, సుంకన్న పాల్గొన్నారు. ప్రభుత్వ ఉన్నత విద్యా ఆధ్యయన సంస్థ (బీఈడీ) కళాశా లలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలను ప్రిన్సిపాల్‌ ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఫ దళిత హక్కుల పోరాట సమితి అధ్వర్యంలో రాజ్‌విహార్‌ కూడలిలోని అంబేడ్కర్‌ భవనలో ఆయన విగ్రహనికి జిల్లా కార్యదర్శి సి.మహేష్‌ పూల మాలలు వేసి నివాళులర్పించారు. సీపీఐ కార్యాలయంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా సహాయ కార్యదర్శి నక్కి లెనినబాబు, నగర కార్యదర్శి రామక్రిష్ణారెడ్డి, డీహెచ పీఎస్‌ జిల్లా కార్యదర్శి సి.మహేష్‌ నివాళులర్పించారు. పాతబస్టాండులోని అంబేడ్కర్‌ విగ్రహానికి ఏపీఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్‌ జి.నాగముని పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఫ సీపీఎం ఆధ్వర్యంలో పాతబస్టాండు, వీకర్‌ సెక్షన కాలనీ, జోహ రాపురం, కల్లూరు చెన్నమ్మ కూడలి తదితర ప్రాంతాలలో అంబేడ్కర్‌ విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు అలివేలు, నగేష్‌, రమణ, సోలమోన, రాజశేఖర్‌ పాల్గొన్నారు. ఓర్వకల్లులోని ఎస్సీ బాలికల వసతి గృహంలో అంబేడ్కర్‌ విగ్రహానికి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరెడ్డి, మండల కన్వీనర్‌ బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

Updated Date - Apr 15 , 2026 | 12:13 AM