Share News

అభివృద్ధి కోసం కలిసి రావాలి

ABN , Publish Date - May 12 , 2026 | 11:29 PM

రాష్ట్రం, జిల్లా అభివృద్ధి కోసం వైసీపీ నాయకులు కూటమి నేతలతో కలిసి పని చేద్దామని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు.

అభివృద్ధి కోసం కలిసి రావాలి
సమావేశంలో మాట్లాడుతున్న గుడిసె కృష్ణమ్మ

దిగజారుడు వ్యాఖ్యలు చేసిన ఎస్వీ మోహన్‌ రెడ్డి

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ

కర్నూలు అర్బన్‌, మే 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం, జిల్లా అభివృద్ధి కోసం వైసీపీ నాయకులు కూటమి నేతలతో కలిసి పని చేద్దామని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 23 నెలల కాలంలో సూపర్‌ సిక్స్‌తో పాటు హామీ ఇవ్వని ఎన్నో పఽఽథకాలు అమలు చేశామన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నారాలోకేశ్‌ ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో దేశ, విదేశాలు తిరిగి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణంపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. మంత్రి నారా లోకేశ్‌ సింగపూర్‌ విద్యావిధానాన్ని ఇక్కడ అమలు చేయాలనే లక్ష్యంతో అక్కడ అధ్యయనం చేశారని, అద్భుతమైన ఫలితాలు తీసుకురావడం కోసం ఎంతో తపన పడుతున్నారని కొనియాడారు. జిల్లా పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయడం ద్వారా భారీ ఎత్తున పరిశ్రమలు జిల్లాకు తరలిరాబోతున్నాయన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగారి సంజీవకుమార్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వై. నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు ధరూర్‌ జేమ్స్‌, కైప పద్మలతారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, నాయకులు నంద్యాల నాగేంద్ర, పొతురాజు రవికుమార్‌, అబ్బాస్‌, కొరకంచి రవి, జకీయా అక్సారీ, కేవీ సుబ్బారెడ్డి, సత్రం రామకృష్ణుడు, రవి చంద్రశర్మ పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2026 | 11:29 PM