‘పది’ ఫలితాల్లో అగ్రస్థానం సాధిద్దాం
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:22 AM
పదో తరగతి ఫలితాలలో మంచి ఉత్తీర్ణత సాధించి ఈ ఏడాది రాష్ట్రంలోనే జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదామని కలెక్టర్ డాక్టర్ సిరి సూచించారు.
సమన్వయంతో కృషి చేస్తే సాధ్యం
సీ,డీ గ్రేడ్ విద్యార్థులపై దృష్టి పెట్టాలి
కలెక్టర్ సిరి
ఆదోని అగ్రికల్చర్, జనవరి 28(ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాలలో మంచి ఉత్తీర్ణత సాధించి ఈ ఏడాది రాష్ట్రంలోనే జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదామని కలెక్టర్ డాక్టర్ సిరి సూచించారు. బుధవా రం ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స కళాశాల సిల్వర్ జూబ్లీ హాల్‌లో డివిజన లోని మండల విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులతో పదో తర గతి వందరోజుల కార్యాచరణపై డివిజన స్థాయి సమీక్ష సమావేశంలో నిర్వహించారు. ఆమె వందరోజుల ప్రణాళికలో ఇప్పటికే 60 రోజులు పూర్తయ్యాయని మిగిలిన 40 రోజులలో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. పదో తరగతి విద్యార్థులు బడికి రాకపోతే వెంటనే వారి తల్లిదండ్రులకు ఫోన చేసి వారి పురోగతిని వారికి తెలియజేయాల న్నారు. ఉదయం, జిల్లా పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే చివరి స్థానంలో ఉందని, దీనివల్ల జిల్లా ప్రతిష్ట దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. లీప్ యాప్‌లో విద్యార్థుల మార్కులు నమోదు చేయడం లో పెండింగ్ లేకుండా చూడాలన్నారు. 1.61లక్షల మంది నిరాక్షర్యాసుల ను గుర్తించామన్నారు. వారికి శిక్షణ ఇచ్చి అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ అజయ్ కుమా ర్, డీఈవో సుధాకర్ డిప్యూటీ ఈవో రాజేంద్రప్రసాద్, ఎంఈవోలు భూపాల్ రెడ్డి శ్రీనివాసులు రామ్మూర్తి పాల్గొన్నారు.
ఏకీకృత కుటుంబ సర్వే వేగవంతం చేయాలి
ఆదోని రూరల్: ఏకీకృత కుటుంబ సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు. బుధవారం సబ్ కలెక్టర్ అజయ్ కు మార్, ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధితో కలిసి మండిగిరి పంచాయతీ పరిధిలోని పలు ఇళ్లకు వెళ్లి సర్వేను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడు తూ ఏకీకృత కుటుంబ సర్వేను వేగవంతం చేయాలని ఎంపీడీవో నాగరాజు స్వామి, మున్సిపల్ కమిషనర్ కృష్ణను ఆదేశించారు. వీధులను శుభ్రంగా ఉంచాలని సూచించారు.
అంగనవాడీల ద్వారా సమగ్ర సేవలు అందించాలి
పత్తికొండ: అంగనవాడీ కేంద్రాల ద్వారా సమగ్ర సేవలు అందించా లని కలెక్టర్ సిరి ఆదేశించారు. బుధవారం పత్తికొండ ఎం.కన్వెన్షన హాలులో పత్తికొండ డివిజన సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, అంగనవాడీ కార్యకర్తలతో మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాల అమలు అంశంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు సెంటర్లు పనిచేయాలన్నారు. పీడీ విజయ, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, అంగనవాడీవర్కర్లు ఉన్నారు.
రైతులకు నోటీసులు ఇచ్చాకే సర్వే చేయాలి: రైతులకు నోటీసులు ఇచ్చిన తర్వాతనే సరే చేయాలని కలెక్టర్ సిరి రెవెన్యూ సిబ్బందికి సూచించారు. పత్తికొండ టీటీడీ కల్యాణ మండపంలో పత్తికొండ రెవెన్యూ డివిజన తహసీల్దార్‌లు, సర్వేయర్లు, వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లతో ఆమె రీసర్వే అంశపై సమీక్ష నిర్వహించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరిం చాలని, డబ్బు వసూలు చేయకూడదని ఆదేశించారు. ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం జేసీ నూరుల్‌ఖమర్ మాట్లాడుతూ ఒకసారి నోటీసు ఇచ్చి సర్వేకు వెల్లని పక్షంలో మరోసారి సర్వేకు సంబందించి తప్పనిసరిగా నోటీసు ఇవ్వాల న్నారు. ఆర్టీవో భరతనాయక్, తహసీల్దార్ హుసేనసాహెబ్ ఉన్నారు.
ఉన్నత స్థాయికి చేరుకోవాలి: విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ సిరి సూచించారు. బుధవారం పత్తికొండ బీసీ బాలికల వసతి గృహాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈసందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. వసతిగృహంలో ఆహారం గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటలను పరిశీలించారు. వసతి గృహం కాంపౌండ్ ప్యాచవర్కులు చేయించాలని విద్యార్థులు కలెక్టర్‌ను కోరగా.. పదిరోజుల్లో పూర్తి చేయిస్తానని ఆమె హామీ ఇచ్చారు.