విజయయే లక్ష్యంగా పనిచేద్దాం
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:18 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్య ర్థుల విజయమే లక్ష్యంగా పనిచేద్దామని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ అన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ
కర్నూలు అర్బన్ , సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్య ర్థుల విజయమే లక్ష్యంగా పనిచేద్దామని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ అన్నారు. శనివారం జిల్లా తెలుగుదేళం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సం బంధించి కూటమి పార్టీల సమన్వయం, ఎన్నికల వ్వూహం, క్షేత్ర స్థాయి కార్యాచరణ అంశాలపై విస్తృతంగా చర్చించారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని నిర్ణయించారు. గుడిసె క్రిష్ణమ్మ మాట్లాడుతూ కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేసి మరో సారి ప్రజల మద్దతుతో ఘన విజయం సాధించుదామన్నారు. టీడీపీ జోన్-5 కోఆర్డినేటర్, స్థానిక సంస్థల ఎన్నికల ఇన్‌చార్జి పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, జనసేన కోఆర్డినేటర్ చిలకం మఽధుసూధన్‌రెడ్డి, సమన్వయ కమిటీ సభ్యులు చింతాసురేష్, రేఖగౌడ్, అర్షద్, బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణ, రాష్ట్ర బిల్డింగ్ కమిటీ సభ్యుడు విట్టా రమేష్ పాల్గొన్నారు.