Share News

స్వచ్ఛ ఆరోగ్యకర జిల్లాగా మార్చుద్దాం

ABN , Publish Date - Sep 22 , 2026 | 10:57 PM

నంద్యాల జిల్లాను స్వచ్ఛ ఆరోగ్యకర జిల్లాగా మార్చుదామని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

స్వచ్ఛ ఆరోగ్యకర జిల్లాగా మార్చుద్దాం
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల టౌన్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాను స్వచ్ఛ ఆరోగ్యకర జిల్లాగా మార్చుదామని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్‌ టౌన్‌ హల్లో ఏర్పాటుచేసిన హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌(హెచ్‌ఏఎం) పథకం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆమెతో పాటు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ ఎండీ ఫిరోజ్‌ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీలకు రూ.164కోట్లు విలువైన అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబునాయుడు కుప్పం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. రూ.164 కోట్లను జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనులకు ఉపయో గిస్తామని తెలిపారు. చెత్తను సేకరించి శాస్ర్తీయ పద్దతిలో వర్మీ కంపోస్టుగా చేసి సేంద్రియ ఎరువులుగా ఉపయోగిస్తామన్నారు. అధికారులందరూ సమన్వ యంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్‌ శేషన్న, మున్సిపల్‌ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 10:57 PM