Share News

బాలల హక్కులను కాపాడుదాం

ABN , Publish Date - Jun 30 , 2026 | 11:39 PM

బాలల హక్కులను కాపాడుదామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ వేటకూరి ఏవీఎస్‌ సూర్యనారాయణరాజు పిలుపునిచ్చారు.

బాలల హక్కులను కాపాడుదాం
మాట్లాడుతున్న కమిషన్‌ చైర్మన్‌, పక్కన కలెక్టర్‌

బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ ఏవీఎస్‌ సూర్యనారాయణరాజు

నంద్యాల నూనెపల్లి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): బాలల హక్కులను కాపాడుదామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ వేటకూరి ఏవీఎస్‌ సూర్యనారాయణరాజు పిలుపునిచ్చారు. పట్టణంలోని వందేమాతరం సమావేశ మందిరంలో మంగళవారం బాలల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ పథకాల అమలుపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కమిషన్‌ చైర్మన్‌, ఎస్పీ సునీల్‌ షెరాన్‌, కమిషన్‌ సభ్యుడు చల్లా మధుసూదన్‌ హాజరయ్యారు. చైర్మన్‌ మాట్లాడుతూ.. శాఖల మధ్య సమన్వయం, క్షేత్రస్థా యిలో అధికారుల పనితీరు మెరుగుపర చుకోవాల న్నారు. బాలలపై జరిగే అన్యాయాలు, పోక్సో కేసులు, జేజే యాక్ట్‌ కేసులకు సంబంధించి పోలీస్‌, ఐసీడీఎస్‌, లేబర్‌, ఎడ్యుకేషన్‌ శాఖల వద్దనున్న సమాచారంలో వ్య త్యాసాలు ఉండకుండా చూసుకోవాలన్నారు. కేసు నమోదైన 60 రోజుల్లో చార్జ్‌షీట్‌ ఫైల్‌ అయ్యేలా పనిచేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 0 నుంచి 18 ఏళ్ల పిల్లల కోసం ప్రవేశపెట్టిన పథకాలు క్షేత్రస్థాయిలో అందరికీ చేరాలన్నారు. బాల్యవివా హాలనను అరికట్టాలన్నారు. బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ.. ఉన్నత స్థాయిలో జరిగే సైద్ధాంతిక చర్చలకు, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంటుందన్నారు. బాల్య వివాహాల నిర్మూలన సమాచారం రాగానే వివాహాన్ని ఆపినప్పటికీ, కొన్నిసార్లు కుటుంబ సభ్యులు అధికారులను తప్పుదోవ పట్టించి రాత్రి సమయాల్లో వివాహాలు జరిపిస్తున్నట్లు వివరించారు. ఇటువంటి వాటిపై శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, అవసర మైతే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి కూడా వెనుకా డబోమని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. వీరి వెంట పాల్గొన్నారు .

Updated Date - Jun 30 , 2026 | 11:39 PM