Share News

కూటమి అభ్యర్థులను గెలిపిద్దాం

ABN , Publish Date - Oct 28 , 2026 | 11:11 PM

జిల్లా పరిషత్‌ పోరులో కూటమి పార్టీ నాయకులందరూ కలిసి కట్టుగా కూటమి అభ్యర్థులను గెలిపిద్దామని నంద్యాల జిల్లా పరిశీలకుడు వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి పేర్కొన్నారు.

 కూటమి అభ్యర్థులను గెలిపిద్దాం
మాట్లాడుతున్న జిల్లా పరిశీలకుడు వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, పక్కన మంత్రులు ఫరూక్‌, బీసీ

గోస్పాడు, గడివేముల జడ్పీటీసీ స్థానాలు జనసేనవే

నంద్యాల జిల్లా పరిశీలకుడు వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి

నంద్యాల, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ పోరులో కూటమి పార్టీ నాయకులందరూ కలిసి కట్టుగా కూటమి అభ్యర్థులను గెలిపిద్దామని నంద్యాల జిల్లా పరిశీలకుడు వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్‌, బీసీ జనార్దన్‌ రెడ్డి, నందికొట్కూరు ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమితో పొత్తు నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు సర్దుబాటు జాప్యంతో కొందరు టీడీపీ, జనసేన అభ్యర్థులు వేర్వేరుగా నామినేషన్లు దాఖలు చేశారన్నారు. పొత్తుధర్మం ప్రకారం..గోస్పాడు, గడివేముల జడ్పీటీసీ స్థానాలు జనసేన పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులకే కేటాయించామన్నారు. ఈ రెండు స్థానాల్లో జనసేన జడ్పీటీసీ అభ్యర్థులకు టీడీపీ నేతలు, నాయకులు, కార్యకర్తల పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటే లక్ష్యంతో పరిషత్‌ ఎన్నికల్లో ముందుకు సాగుతాయని తెలియజేశారు.

Updated Date - Oct 28 , 2026 | 11:11 PM