Share News

నిమజ్జనోత్సవాన్ని వైభవంగా నిర్వహిద్దాం

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:23 AM

జిల్లాలో గణేశ నిమజ్జనోత్సవాలను వైభవంగా నిర్వహిద్దామని గణేశ మహో త్సవ కేంద్ర సమితి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రమణ, జిల్లా ప్రతినిధులు డాక్టర్‌ ఎం. నాగఫణి శాసి్త్ర, ఎస్‌. రంగస్వామి పిలుపునిచ్చారు.

నిమజ్జనోత్సవాన్ని వైభవంగా నిర్వహిద్దాం
మాట్లాడుతున్న గణేశ మహోత్సవ కేంద్ర సమితి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌

కర్నూలు కల్చరల్‌, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గణేశ నిమజ్జనోత్సవాలను వైభవంగా నిర్వహిద్దామని గణేశ మహో త్సవ కేంద్ర సమితి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రమణ, జిల్లా ప్రతినిధులు డాక్టర్‌ ఎం. నాగఫణి శాసి్త్ర, ఎస్‌. రంగస్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం వినాయక ఘాట్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 14 నుంచి ప్రారంభమయ్యే గణేశ నవరాత్రి ఉత్సవాలు కర్నూలులో ఈనెల 22న కేసీ కెనాల్‌ వినాయక ఘాట్‌లో అత్యంత వైభవంగా సామూహిక విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని తెలి పారు. నిమజ్జనంలో ఎలాంటి అపోహలు వద్దన్నారు. రాష్ట్ర పరిశ్ర మల శాఖ మంత్రి టీజీ భరత, రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ తమ పూర్తి సహకారం అందించి, నగరంలోని కేసీ కెనాల్‌ వినాయక ఘాట్‌లో నిమజ్జనం నాటికి నీళ్లు అందే విధంగా ప్రయ త్నాలు ముమ్మరంగా చేస్తున్నారన్నారు. ఈసమావేశంలో సమితి ప్రతినిధులు ఎం. రాజేశ శర్మ, గిరిరాజవర్మ, అక్కెం విశ్వనాథ్‌, ఈపూరి నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2026 | 12:23 AM