Share News

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిద్దాం

ABN , Publish Date - Oct 01 , 2026 | 12:21 AM

త్వరలో జరగగనున్న నగర పాలక సంస్థ సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిద్దామని, అందుకు అవసరమైన చర్యలను ఇప్పటి నుంచే చేపట్టాలని అడిషనల్‌ ఎలక్షన అథారిటీ, నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు పోలీసు అధికారులను ఆదేశిం చారు.

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిద్దాం
పోలీసు అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్‌ చల్లా ఓబులేసు

నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): త్వరలో జరగగనున్న నగర పాలక సంస్థ సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిద్దామని, అందుకు అవసరమైన చర్యలను ఇప్పటి నుంచే చేపట్టాలని అడిషనల్‌ ఎలక్షన అథారిటీ, నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు పోలీసు అధికారులను ఆదేశిం చారు. బుధవారం కౌన్సిల్‌ హాలులో డీఎస్పీ రాఘవేంద్రతో పాటు నగర పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడూతూ నగరంలో 487 పోలింగ్‌ కేంద్రాల పరిదిలో 4,79,861 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారద ర్శకంగా జరి గేలా అన్నిశా ఖలు సమన్వయంతో పని చేయాలని సూ చించారు. అన్ని పోలింగ్‌ కేం ద్రాల్లో సీసీ కెమెరాలు, విద్యుత దీపాలు, ర్యాంపులు తదితర అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. సమావేశంలో సీఐలు చంద్రబాబు నాయుడు, శేష య్య, విక్రమసింహ, మారుతిశంకర్‌, ఎస్‌ఐలు మోహన కిషనరెడ్డి, నాగరాజు పాల్గొన్నారు

Updated Date - Oct 01 , 2026 | 12:21 AM