Share News

గాంధీజీ ఆశయాలను కొనసాగిద్దాం

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:05 AM

జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను కొనసాగిద్దామని పలువురు ప్రముఖులు అన్నారు.

గాంధీజీ ఆశయాలను కొనసాగిద్దాం
గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న ఎంపీ నాగరాజు

జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను కొనసాగిద్దామని పలువురు ప్రముఖులు అన్నారు. జిల్లాలో శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కర్నూలు రూరల్‌ మండలం పంచలింగాలలో ఎంపీ నాగరాజు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కర్నూలు నగరంలోని జడ్పీ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి మాజీ ఎంపీ టీజీ వెంకటేశ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గాంధీ దేశానికి చేసిన సేవలను ప్రతిఒక్కరూ స్మరించుకోవాలన్నారు.

ఫ ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌

Updated Date - Oct 03 , 2026 | 12:05 AM