Share News

ఆరోగ్యకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:19 AM

పిల్లల మధ్య వ్యవధి పాటించి ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దామని డీఎంహెచ్‌వో డా.ఎల్‌.భాస్కర్‌ పిలుపునిచ్చారు.

ఆరోగ్యకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం
ర్యాలీలో పాల్గొన్న డీఎంహెచ్‌వో, అధికారులు

డీఎంహెచ్‌వో డాక్టర్‌ భాస్కర్‌

కర్నూలు హాస్పిటల్‌, జూలై 11(ఆంధ్రజ్యోతి): పిల్లల మధ్య వ్యవధి పాటించి ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దామని డీఎంహెచ్‌వో డా.ఎల్‌.భాస్కర్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద అవగాహన ర్యాలీని డీఎంహెచ్‌వో జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు జనాభా దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంతానోత్పత్తి రేటును పెంచే విదంగా అర్హులైన దంపతులకు కౌన్సిలింగ్‌ ఇవ్వాలని, దంపతులు మేమిద్దరం మాకు ముగ్గురు అనే విధంగా వారిలో జనాభా సమతుల్యత స్థిరీకరణపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అర్హులైన దంపతులకు పిల్లల మధ్య వ్యవధి పాటించడానికి తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతిని ఎంచుకునే విధంగా చేయాలన్నారు. అనంతరం ఈ ర్యాలీ జీజీహెచ్‌ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుని అక్కడ డీఎంహెచ్‌వో ప్రతిజ్ఞ చేయించారు. ఆర్‌బీఎ్‌సకే జిల్లా కోఆర్డినేటర్‌ డా.ఎ్‌స.మహేశ్వర ప్రసాద్‌, సంచార చికిత్స నోడల్‌ ఆఫీసర్‌ డా.విశ్వేశ్వరరెడ్డి, గణాంకాధికారి (ఎస్‌వో) మేమసుందరం, డెమో ఎన్‌.ప్రకా్‌సరాజ్‌, హెచ్‌ఈఈవో బాబా ఫకృద్దీన్‌, డిప్యూటీ డెమో పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 12:19 AM