Share News

శ్రీశైలం శివార్లలో చిరుత సంచారం

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:36 PM

శ్రీశైల క్షేత్ర శివార్లలో నిత్యం పులులు, చిరుతలు సంచరిస్తూనే ఉన్నాయి.. శుక్రవారం తెల్లవారుజామున పాతాళగంగ రోడ్డు మార్గంలో నివాసం ఉన్న సత్యనారాయణశర్మ ఇంటి ఆవరణలోకి చిరుత ప్రవేశించింది.

శ్రీశైలం శివార్లలో చిరుత సంచారం
సీసీ పుటేజీలో కనిపించిన చిరుత

భక్తులు అప్రమత్తంగా ఉండాలి : ఎఫ్‌ఆర్‌వో

శ్రీశైలం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైల క్షేత్ర శివార్లలో నిత్యం పులులు, చిరుతలు సంచరిస్తూనే ఉన్నాయి.. శుక్రవారం తెల్లవారుజామున పాతాళగంగ రోడ్డు మార్గంలో నివాసం ఉన్న సత్యనారాయణశర్మ ఇంటి ఆవరణలోకి చిరుత ప్రవేశించింది. ఆ సమయంలో మొబైల్‌లో కదలికలను గుర్తించే మోషన్‌ డిటెక్షన్‌ అలారం మోగటంతో మేల్కొన్న సత్యనారాయణ అప్రమత్తమై సీసీ ఫుటేజీని పరిశీలించి స్థానికులను అప్రమత్తం చేశారు. కల్యాణకట్ట, మల్లికార్జున సత్రం, రజకసత్రం తదితర ప్రాంతాల్లో చిరుత తిరిగిన జాడలు కనిపించాయని పలువురు యాత్రికులు అంటున్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న క్షేత్ర శివారు ప్రాంతాల్లో నివాసం ఉండే వారు, భక్తులు రాత్రి 10గంటల నుంచి తెల్లవారుజాము 5గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌ఆర్‌వో) పరమేశులు హెచ్చరిస్తున్నారు. దేవస్థానం అధికారులు కూడా ఎప్పటికప్పుడు మైక్‌ సెట్ల ద్వారా భక్తుల్లో వన్యమృగాల సంచారంపై అప్రమత్తం చేస్తూనే ఉన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 11:36 PM