క్రమబద్ధీకరణతోనే చట్టబద్ధత
ABN , Publish Date - May 11 , 2026 | 12:26 AM
అనధికార లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబ ద్ధీకరణ చేసుకోవడం ద్వారా ఆస్తులకు పూర్తి చట్టబద్ధత లభిస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు.
కార్పొరేషన కమిషనర్ చల్లా ఓబులేసు
ముగిసిన ఎల్‌ఆర్‌ఎస్ మేళా
కర్నూలు న్యూసిటీ, మే 10(ఆంధ్రజ్యోతి): అనధికార లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబ ద్ధీకరణ చేసుకోవడం ద్వారా ఆస్తులకు పూర్తి చట్టబద్ధత లభిస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. ప్రజలకు ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పిస్తూ, పెండింగ్ దరఖాస్తును వేగవంతంగా పరిష్కరించేందుకు నగర పాలక సంస్థ అధ్వర్యంలో పట్టణ ప్రణాళిక అధికారులు, ప్లానింగ్ కార్యదర్శులు, ఎల్‌టీపీలతో కలిసి నిర్వహించిన ఎల్‌ఆర్‌ఎస్ మేళా ఆదివారంతో ముగిసింది. స్థానిక ఎస్‌బీఐ కాలనీలోని నగర పాలక సమావేశ భవనంలో చల్లా ఓబులేసు దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసు కున్న వారికి అప్రూవల్ ప్రొసీడింగ్స్ అందజేశారు. కమిషనర్ మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఈ మేళాలో విశేష స్పందన లభించిందన్నారు. మేళా ద్వారా 110 మందికి అప్రూవల్ ప్రొసీడింగ్స్ జారీ చేయగా రూ.98.56 లక్షల మేర ఫీజులు వసూలైనట్లు వెల్లడించారు. నగర పరిధిలో మొత్తం 2902 ఎల్‌ఆర్‌ఎస్ దరఖా స్తులు అందగా, ఇప్పటి వరకు 865 దరఖాస్తులు ఆమోదించినట్లు తెలిపారు. మరో 565 దరఖాస్తులకు షార్ట్‌ఫాల్ సమాచారం, 426 దరఖాస్తుకు చెల్లింపు సమాచారం అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రతి శుక్రవారం ఎస్‌బీఐ కాలనీలోని నగర పాలక సమావేశ భవనంలో ఎల్‌ఆర్‌ఎస్ మేళాను నిర్వహించను న్నట్లు ఆయన తెలిపారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు సంబంధిత పత్రాలతో హజరై సమస్యలను పరిష్కరించుకోవాలని కమిషనర్ సూచించారు.