ప్రజలకు చేరువగా న్యాయసేవలు
ABN , Publish Date - Apr 27 , 2026 | 11:32 PM
సమాజంలో ప్రజలకు మరింత చేరువగా న్యాయ సేవలు అందించడానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుందని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి తెలియజేశారు.
జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి
కర్నూలు లీగల్, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): సమాజంలో ప్రజలకు మరింత చేరువగా న్యాయ సేవలు అందించడానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుందని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి తెలియజేశారు. కర్నూలులోని న్యాయ సేవాసదన్ భవన్‌లో న్యాయ సేవల వాహనాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రజలకు చట్టాలపై అవగాహన, న్యాయ సహాయం, హక్కులపై చైతన్య పరచడానికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాగూర్ ప్రతి జిల్లాకు ఒక వాహనాన్ని కేటాయించారని తెలిపారు. ఈ వాహనాలు హక్కులపై అవగాహన కల్పించి చైతన్యం తీసుకువచ్చేందుకు ఉపయోగ పడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, శాశ్వత లోక్‌అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరామచంద్రరావు, న్యాయవాదులు పాల్గొన్నారు.