Share News

న్యాయాధికారులకు చట్టాలపై అవగాహన

ABN , Publish Date - Feb 28 , 2026 | 11:31 PM

ఇటీవలే వచ్చిన మూడు కొత్త క్రిమినల్‌ చట్టాలపై అవగాహన కల్పించేందుకే శనివారం జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి వర్క్‌షాపు ప్రారంభించారు.

న్యాయాధికారులకు చట్టాలపై అవగాహన
న్యాయాధికారులతో జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్థి

కర్నూలు లీగల్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ఇటీవలే వచ్చిన మూడు కొత్త క్రిమినల్‌ చట్టాలపై అవగాహన కల్పించేందుకే శనివారం జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి వర్క్‌షాపు ప్రారంభించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న న్యాయాధికారులందరికీ స్థానిక జిల్లా కోర్టులో ఈ వర్క్‌షాపు జరిగింది. ఈ క్రిమినల్‌ చట్టాలు విజయవంతంగా అమలు చేయడం, ప్రభావిత ప్రాంతాలపై చర్చ అనే అంశంపై న్యాయాధికారులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరిక సురక్ష సహితం-2023, భారతీయ సాక్ష్య అధీనియం-2023లు ఈ మూడు కొత్తగా వచ్చిన క్రిమినల్‌ చట్టాలపై న్యాయాధికారులు పట్టు సాదించి కేసులను పకడ్బందీగా నిర్వహించేందుకు ఉపయోగపడుతుందని జిల్లా ప్రదాన న్యాయాధికారి జి.కబర్ది తెలిపారు.

Updated Date - Feb 28 , 2026 | 11:31 PM