న్యాయ, వైద్య శిబిరం అభినందనీయం
ABN , Publish Date - May 04 , 2026 | 11:34 PM
ఉచిత న్యాయ, వైద్య శిబి రం ఏర్పాటు చేయడం అభినందనీయమని, దీని వల్ల అందరికీ న్యాయం, ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలావెంకటశేషాద్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి
నందికొట్కూరు, మే 4 (ఆంధ్రజ్యోతి) : ఉచిత న్యాయ, వైద్య శిబి రం ఏర్పాటు చేయడం అభినందనీయమని, దీని వల్ల అందరికీ న్యాయం, ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలావెంకటశేషాద్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం పట్టణంలోని శ్రీకాళీ ప్రసాద ఆశ్రితాశ్రమంలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి లీలా వెంకటశేషాద్రి, అదనపు సీనియర్ సివిల్ న్యాయాధికారి దివాకర్, నందికొట్కూరు సీనియర్ సివిల్ న్యాయాధికారి శోభారాణి, జూనియర్ సివిల్ న్యాయాధికారి దివ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ పల్లెప్రియాంక సేవా సమితి ఆధ్వర్యంలో వినికిడి లోపం కలిగిన వ్యక్తులను గుర్తించి వారికి వినికిడి పరికరాలను అందించడం ఎంతో అభినందనీయమని అన్నారు. శ్రీ గురుదేవ్ చారిట బుల్ ట్రస్ట్, శ్రీ శాంతిరాం మెడికల్ కాలేజ్ వారి సహకారంతో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య బృందం డా. చైతన్య రెడ్డి, డా.పి. రాజా, సన్మార్క్ సేవా సమితి ప్రెసిడెంట్ నాగన్న, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.