Share News

దెబ్బతిన్న కేసీ కాలువ లైనింగ్‌

ABN , Publish Date - Mar 08 , 2026 | 12:19 AM

మండలంలోని మల్లేవేముల గ్రామం వద్ద కేసీ కాలువ లైనింగ్‌ దెబ్బతిని నీరు వృథాగా పోతోంది. గొట్లూరు గ్రామ సమీపంలోని కేసీ ప్రధాన కాలువ నుంచి గోపాయపల్లె, మల్లేవేముల గ్రామాలకు నీరు ప్రవహించే కాలువ లైనింగ్‌ దెబ్బతిని లీకేజీ నీరు శనివారం పొలాల్లో ప్రవహించింది.

దెబ్బతిన్న కేసీ కాలువ లైనింగ్‌
నీట మునిగిన నువ్వుల పొలం, ఇన్‌సెట్‌లో మల్లేవేములలో లీకేజీ

చాగలమర్రి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మల్లేవేముల గ్రామం వద్ద కేసీ కాలువ లైనింగ్‌ దెబ్బతిని నీరు వృథాగా పోతోంది. గొట్లూరు గ్రామ సమీపంలోని కేసీ ప్రధాన కాలువ నుంచి గోపాయపల్లె, మల్లేవేముల గ్రామాలకు నీరు ప్రవహించే కాలువ లైనింగ్‌ దెబ్బతిని లీకేజీ నీరు శనివారం పొలాల్లో ప్రవహించింది. రైతులకు నష్టం వాటిల్లింది. రబీలో సాగుచేసిన నువ్వులు, సంజ, మొక్కజొన్న పంటల్లో నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో రైతులు ఇసుక సంచులతో అడ్డుకట్టలు వేసుకున్నారు. నీటి ఉధృతి అధికం కావడంతో ఇసుక సంచులను దాటి నీరు ప్రవహించింది. 50 ఎకరాల వరకు పంటల్లోకి నీరు చేరిందని రైతులు నరసింహారెడ్డి, దస్తగిరిరెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి, విగ్నేశ్వరరెడ్డి, రామారెడ్డి, హరిప్రసాద్‌, మరి కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట కాలువలకు మరమ్మతులు చేయాలని పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోవడం లేదనివాపోతున్నారు. కేసీ ప్రధాన కాలువ నుంచి పంట కాలువకు నీరు నిలిపివేసి పంట నష్టం జరుగకుండా చూడాలని రైతులు కోరారు.

Updated Date - Mar 08 , 2026 | 12:19 AM