నాయకులు సమన్వయంతో పనిచేయాలి
ABN , Publish Date - Oct 19 , 2026 | 12:57 AM
టీడీపీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
కోవెలకుంట్ల, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): టీడీపీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వివరించాలని సూచించారు. వైసీపీ నాయకుల అరాచకాలే. దౌర్జన్యాలను ప్రజలకు తెలియజేసి కూటమి పార్టీ అభ్యర్ధుల గెలుపుకు పని చేయాలని తెలిపారు. సొసైటీ చైర్మన్ గువ్వల సుబ్బారెడ్డి, సౌదరదిన్నె వెంకట సుబ్బారెడ్డి, బీవి ప్రసాద్ రెడ్డి, గడ్డం నాగేశ్వర్ రెడ్డి, వెలగటూరు ధనుంజయుడు, గజ్జల హుస్సేనయ్య, జగదీశ్వర్ రెడ్డి, అర్జున్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, సుబ్బారెడ్డి, సునీల్ రెడ్డి, సుబ్బారెడ్డి ఉన్నారు.