విధుల్లో అలసత్వం తగదు
ABN , Publish Date - Apr 29 , 2026 | 11:56 PM
నగరంలో పారిశుధ్య నిర్వహణ సమర్థవంతంగా ఉండాలని, విధుల్లో అల సత్వం తగదని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబు లేసు ఆదేశించారు.
కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): నగరంలో పారిశుధ్య నిర్వహణ సమర్థవంతంగా ఉండాలని, విధుల్లో అల సత్వం తగదని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబు లేసు ఆదేశించారు. బుధవారం ఆయన కొండారెడ్డి బురుజు వద్ద 1వ శానిటేషన్ డివిజన్‌లో మస్టర్ తనిఖీ చేశారు. అనంతరం ఆనంద్ థియేటర్, సంతోష్‌నగర్, ముజఫర్ నగర్ ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. స్వచ్ఛత పనుల్లో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. విధుల్లో బదులు వ్యవస్థ అందరికీ వర్తించదని, పక్షపాతం, అంగవైకల్యం ఉన్న వారికి మానవత్వ దృక్ఫథంతో వెసులుబాటు కల్పించామన్నారు. విధుల్లో యూని ఫాం తప్పని సరిగ్గా ధరించాలన్నారు. కార్మికులకు అవసర మైన హెల్త్ కిట్లు, పనిముట్లు త్వరిగతిన అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జాప్యం లేకుండ వాహనాలకు మరమ్మతు చేయించాలని సూచించారు. పూలబ జార్ వద్ద అపరిశుభ్రంగా ఉండటం, నిర్వాహకుల మధ్య సమ న్వయం లోపించడం వంటి కారణాలతో 130వ సచివాలయ శానిటేషన్ కార్యదర్శి సి. మద్దిలేటికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఆనంద్ థియేటర్ వద్ద ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న పాత దుకాణాల వద్ద చాలా రోజు లుగా అపరిశుభ్రంగా ఉన్నందు వల్ల 31వ సచివాలయ శాని టేషన్ కార్యదర్శి కే. సురేష్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. ప్రజారోగ్య అధికారి డా.ఎం. రఘు, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు రమేష్, లోకేషన్, రవి, అనిల్ ఎంజల్ పాల్గొన్నారు.