Share News

సమస్యల పరిష్కారంలో అలసత్వం తగదు

ABN , Publish Date - Jul 20 , 2026 | 11:31 PM

నిర్ణీత గడువులోగా అధికారులు సమస్యలకు పరిష్కారం చూపాలని, అలసత్వం తగదని సునీల్‌ షెరాన్‌ అన్నారు.

సమస్యల పరిష్కారంలో అలసత్వం తగదు
అర్జీలు స్వీకరిస్తున్న ఎస్పీ సునీల్‌ షెరాన్‌

ఎస్పీ సునీల్‌ షెరాన్‌

నంద్యాల క్రైం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): నిర్ణీత గడువులోగా అధికారులు సమస్యలకు పరిష్కారం చూపాలని, అలసత్వం తగదని సునీల్‌ షెరాన్‌ అన్నారు. పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదిదారులతో ఆయన స్వయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 157 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదులను పరిష్కరించిన అనంతరం వివరాలను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి సకాలంలో నివేదించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసు యంత్రాంగం ఎల్లవేళలా కట్టుబడి ఉం టుందన్నారు. ఒకే సమస్యపై ఫిర్యాదులు పునరావృతం కాకుండా సమర్థ మంతమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.

Updated Date - Jul 20 , 2026 | 11:31 PM