Share News

న్యాయవాదుల నిరసనలు ఉధృతం

ABN , Publish Date - Aug 25 , 2026 | 11:02 PM

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదులు చేపట్టిన నిరసనలు మంగళవారం ఉధృతమయ్యాయి.

న్యాయవాదుల నిరసనలు ఉధృతం
మానవహారాన్ని ఏర్పాటు చేసి నిరసన తెలుపుతున్న న్యాయవాదులు

కర్నూలు లీగల్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదులు చేపట్టిన నిరసనలు మంగళవారం ఉధృతమయ్యాయి. బార్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు న్యాయవాదులు తమ కోర్టు విధులను బహిష్కరించి ర్యాలీగా కొండారెడ్డి బురుజు వరకు చేరుకొని అక్కడ వారు మాన వహారం నిర్వహించి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి. చంద్రుడు మాట్లాడుతూ న్యాయవాదులు కొన్ని రోజులుగా చేస్తున్న నిరసనలను ప్రభుత్వం ఉదాసీన వైఖరితో చూస్తుందని, ఇదే కొనసాగితే.. తాము తమ నిరసనను ఇంకా తీవ్రతరం చేస్తామని హెచ్చ రించారు. స్థానిక ధర్నా చౌకులో న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు రెండో రోజు కూడా కొనసాగాయి. బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి టి.మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటుచేయాలని సర్క్యూట్‌ బెంచ్‌ను గానీ, మరీ ఏఇతర ప్రత్యామ్నాయం కానీ న్యాయవాదులు అంగీకరిం చరని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా రాయలసీమ న్యాయవాదుల దీర్ఘకాలిక డిమాండ్‌ను అంగీకరించి రాయలసీమ వాసులకు న్యాయం చేయాలని కోరారు.

Updated Date - Aug 25 , 2026 | 11:02 PM