విధులు బహిష్కరించిన న్యాయవాదులు
ABN , Publish Date - Aug 19 , 2026 | 11:34 PM
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ కర్నూలు న్యాయవాదులు బుధవారం తమ కోర్టు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.
కర్నూలు లీగల్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ కర్నూలు న్యాయవాదులు బుధవారం తమ కోర్టు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు న్యాయవా దులు బుధవారం నుంచి మూడు రోజుల పాటు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు మంగళవారం బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. ఈ తీర్మాణం మేరకు బుధవారం న్యాయవాదులు కర్నూలులోని అన్ని కోర్టు విధులను బహిష్కరించారు. ఆ తర్వాత జిల్లా కోర్టు మెయిన్‌గేటు ముందు పెద్ద సంఖ్యలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీనియర్ న్యాయవాది వై. జయరాజు మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు బెంచ్ విషయంలో ప్రభుత్వం ధ్వంద్వ ఆలోచనలు అవలంభిస్తుందని, దీంతో రాయలసీమ న్యాయవాదులు తీవ్ర ఆందోళనలకు గురై నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఏ. శివరామయ్య, ఏ. రామసుబ్బారెడ్డి, సి. నాగేంద్రనాథ్, కే. ఓంకార్, మురళి మనోహర్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, న్యాయవాదులు బీఎస్ రవికాంత్ ప్రసాద్, యజాజ్ పాల్గొన్నారు.