Share News

భూమాయం

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:39 AM

మండలంలోని కోటకొండ రెవెన్యూ కె.కొత్తూరు గ్రామంలో 571/1ఎ పోరంబోకు భూమి మొత్తం 1.30 సెంట్లు ఉండగా, ఇందులో 10 సెంట్ల స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఒ వ్యక్తికి కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో విమర్శలు వస్తున్నాయి.

భూమాయం
కె.కొత్తూరు రస్తా పోరంబోకు భూమి ఇదే

కె.కొత్తూరు గ్రామంలో పోరంబోకు స్థలం వ్యక్తికి అప్పగింత, రూ.10లక్షలకు విక్రయం..

రెవెన్యూ అధికారులపై గ్రామస్థుల ఆగ్రహం

రుద్రవరం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కోటకొండ రెవెన్యూ కె.కొత్తూరు గ్రామంలో 571/1ఎ పోరంబోకు భూమి మొత్తం 1.30 సెంట్లు ఉండగా, ఇందులో 10 సెంట్ల స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఒ వ్యక్తికి కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో విమర్శలు వస్తున్నాయి. గురువారం తహసీల్దారు కార్యాలయంలో డీటీ చంద్రశేఖరయ్యపై గ్రామస్థులు బచ్చు నాగేశ్వర్‌రెడ్డి, వడ్డె వెంకటస్వామి, శివమల్లిఖార్జునరెడ్డి ఇంకా పలువురు పోరంబోకు స్థలాన్ని వేరే వ్యక్తికి ఎలా కేటాయించారని ప్రశ్నించారు. పదుల సంవత్సరాల నుంచి సదరు భూమిలో పెంటదిబ్బలు వేసుకుంటున్నామని, రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారని ప్రశ్నించారు. గ్రామస్తులు మాట్లాడుతూ 10సెంట్ల స్థలాన్ని ఒక వ్యక్తికి కేటాయించగా, సదరు వ్యక్తి సెంటు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.10లోలకు విక్రయించాడని ఆరోపించారు. ఈ విషయాన్ని గ్రామస్తులు తహసీల్దారు నాగవీణ దృష్టికి తీసుకెళ్లగా, పోరంబోకు రస్తా విషయాన్ని కలెక్టరు దృష్టికి తీసుకెళతానని, విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Jun 26 , 2026 | 12:39 AM