రేపటి నుంచి లక్ష్మీనరసింహుడి జయంతోత్సవాలు
ABN , Publish Date - Apr 19 , 2026 | 11:28 PM
అహోబిలం లక్ష్మినరసింహ స్వామి జయంతి ఉత్సవాలు ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తు న్నట్లు క్షేత్రస్ధాయి ప్రధాన అర్చకుడు కిడాంభి మదుసూదన్ తెలిపారు.
ఆళ్లగడ్డ ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): అహోబిలం లక్ష్మినరసింహ స్వామి జయంతి ఉత్సవాలు ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తు న్నట్లు క్షేత్రస్ధాయి ప్రధాన అర్చకుడు కిడాంభి మదుసూదన్ తెలిపారు. ఆదివారం మాట్లాడుతూ ప్రపంచం లో మరే ఇతర క్షేత్రాల్లో లేనివిధంగా అహోబిలంలో మాత్రమే ఏడాదికి రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. వైశాఖ మాసంలో స్వామి అవిర్భవించిన సందర్భంగా ఈ జయంతి ఉత్సవాలు నిర్వహి స్తామన్నారు. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలలో ప్రతి రోజు స్వామివారికి శాస్త్రోతంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు