ఆలయాలకు భద్రత కరువు
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:45 AM
కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు భద్రత కరువైందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు.
మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
ఓర్వకల్లు, మార్చి 17(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు భద్రత కరువైందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. మండలంలోని కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో జరిగిన దొంగతనంపై సమాచారం తెలుసుకున్న ఆయన మంగళవారం ఆలయాన్ని సందర్శించారు. ఈవో మద్దిలేటి, అర్చకుడు లక్ష్మినారాయణ శర్మతో మాట్లాడారు. గర్భగుడిలోకి దొంగలు చొరబడి వెండి ఆభరణాలు దొంగలించుకుపోవడం దురదృష్టకరమన్నారు. గతంలో ఇదే ఆలయంలో చోరీ జరిగినా భద్రతా చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. కర్నూలు మాజీ మార్కెట్ యార్డు చైర్మన ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ తిప్పన్న, జడ్పీటీసీ రంగనాథగౌడు, నాయకులు మధుమోహన, హరినాథరెడ్డి, వెంకటేశ్వర్లు, యువరాజ్ ఉన్నారు.