లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
ABN , Publish Date - May 11 , 2026 | 12:28 AM
కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ డిమాండ్ చేశారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ
కర్నూలు న్యూసిటీ, మే 10(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆల్ ఇండియా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆది వారం కొత్తబస్టాండు సుందరయ్య కూడలిలో లేబర్ కోడ్స్ నిబంధనల కాపీలను దహనం చేసి నిరసన తెలిపారు. పీఎస్ రాధాకృష్ణ మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులపై దుర్మార్గంగా వ్యవహరిస్తుంద న్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే లేబర్ కోడ్లను అమలులోకి తీసుకువచ్చి గుట్టచప్పుడు కాకుండా నిబంధనలు ప్రచు రిస్తూ నోటిఫికేషన జారీ చేసిందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్లకు వతాస్తు పలుకుతున్నారన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు వై.నగేష్, కార్యదర్శి నరసింహులు, నాయకులు టి.రాముడు, ఎండీ ఆనంద్‌బాబు, మహ్మద్ రఫి, చలపతి, మధు శేఖర్ పాల్గొన్నారు.