లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
ABN , Publish Date - Feb 13 , 2026 | 01:02 AM
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు అబ్దుల్లా డిమాండ్ చేశారు.
కార్మిక సంఘాల డిమాండ్
ప్రశాంతంగా దేశవ్యాప్త సమ్మె
కోడుమూరు, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు అబ్దుల్లా డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం కోడుమూరు పట్టణంలో సీఐటీ యూ ఆధ్వర్యంలో పాతబస్టాండ్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ జిల్లా నాయకుడు అబ్దుల్లా మా ట్లాడుతూ గతంలో 44 రకాల లేబర్ కోడ్లు ఉంటే వాటిని ప్రస్తుతం నాలు గుగా మార్చడం దారుణమన్నారు. ఈ చట్టాలతో దేశంలోని కార్మి కులు తమ ఉపాధిని కోల్పోతున్నారన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు గఫూర్‌మియా, వీరన్న, రాజు, లక్ష్మన్న, అంగన్ వాడీలు సూలమ్మ, అరుణ, ఆశా వర్కర్లు సుబేదా, శ్రీదేవి పాల్గొన్నారు.
కల్లూరు: కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సీఐటీయూ, రైతుసంఘం, వ్యవ సాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో కె.మధు అధ్యక్షతన ఉలిం దకొండలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో లక్ష్మీదేవి, పద్మ, నాగమణి, యేసురాజు, పూలరంగడు పాల్గొన్నారు.
గూడూరు: కేంద్ర ప్రభుత్వ అమలు చేసిన లేబర్ కోడ్‌లను రద్దు చేయకపోతే ఉద్యమిస్తామని సీఐటీయూ జిల్లా నాయకుడు దివాకర్, సీఐటీయూ డివిజన కార్యదర్శి జే మోహన హెచ్చరించారు. గురువారం గూడూరులో సార్వత్రిక సమ్మెలో భాగంగా సీఐటీయూ, రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. సీఐటీయూ మండల అధ్యక్షుడు గుంటప్ప అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సీఐటీయూ నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో అంగనవాడీ, ఆశా, హమాలీ, మున్సిపల్, ఆర్‌పీలు, వీఆర్‌ఏ, వీఓఏ, ఆటో, స్వచ్ఛ భారత కార్మికులు పాల్గొన్నారు.
ఓర్వకల్లు: లేబర్ కోడ్‌ల అమలును వ్యతిరేకిస్తున్నామని సీఐటీయూ జిల్లా నాయకుడు గోపాల్ అన్నారు. గురువారం ఓర్వకల్లులో దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ప్రశాంతంగా జరిగింది. ఆర్టీసీ బస్టాండు ఎదురుగా నిరసన చేపట్టి అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సమ్మెకు నాగన్న, షాజమాన, శ్రీధర్ అధ్యక్షత వహించారు. ఈ సంద ర్భంగా నాయకులు గోపాల్, నాగన్న మాట్లాడుతూ దేశంలో ఉద్యో గులు, కార్మి కులపై వివక్షత కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మధుసూదన, రామకృష్ణ, సుధాకర్, మల్లేష్, నాగరాజు, వరల, కృష్ణవేణి పాల్గొన్నారు.