Share News

లేబర్‌ కోడ్లు రద్దు చేయాల్సిందే

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:46 PM

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాల్సిందేనని కార్మిక, రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

లేబర్‌ కోడ్లు రద్దు చేయాల్సిందే
ర్యాలీగా వస్తున్న ప్రజా సంఘాల నాయకులు

కార్మిక, రైతు సంఘాల డిమాండ్‌

ప్రశాంతంగా దేశవ్యాప్త సమ్మె

కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాల్సిందేనని కార్మిక, రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం నగరంలోని జడ్పీ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ న్యూసిటీ కమిటీ కార్యదర్శి నరసింహులు, ఏఐటీయూసీ నగర కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ అధ్యక్షతన జరగిన సభలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు కే.రామాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆవుల శేఖర్‌, సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు పి.నిర్మల, జీఐసీ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి రఘుబాబు ప్రసంగించారు. 1926లో వచ్చిన ట్రేడ్‌ యూ నియన్‌ చట్టం, 2008లో వచ్చిన సామాజిక భద్రత చట్టం వరకు 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసిన నాలుగు లేబర్‌ కోడ్‌లను నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకురావడం దారుణమన్నారు. సమ్మె కు ఏపీ డబ్ల్యూజేఎఫ్‌ నాయకులు ప్రసాద్‌, ఏపీడబ్ల్యూజే నాయకులు విజయ్‌కుమార్‌ సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ పెన్షనర్ల సంఘం సంఘీభావం తెలిపారు. బ్యాంకింగ్‌ రంగ ఉద్యోగ సంఘా లు ఏఐబీఈఏ, ఏఐబీఓఏ, బీఈఎ్‌ఫఐ ఇచ్చిన పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు నాయకులు ఈ.నాగరాజు, శివకృష్ణ, హనుమంతరెడ్డి, వికే.వాసు, ఎల్లయ్య, వాసుదేవరెడ్డి, అజయ్‌, పద్మావతి, కృష్ణమోహన్‌ సమ్మెలో భాగస్వాములయ్యారు. ఏఐటీయూసీ జిల్లా కా ర్యదర్శి ఎస్‌.మునెప్ప, సీఐటీయూ జిల్లాకార్యదర్శి ఎండీ.అంజిబాబు, ఏఐటీయూసీ నాయకులు నాగన్న, ఏకేఎంఎస్‌ నాయకులు మల్లికార్జున, బీఎ్‌సఎన్‌ఎల్‌ యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

ప్రయాణికుల తిప్పలు

దేశవ్యాప్త సమ్మెకు ఆటోలు బంద్‌ చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆటోలు తిరగకపోవడంతో ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా 30,000 మంది ఆటోడ్రైవర్లు సమ్మెలో పాల్గొన్నారని ఆటో యూనియన్‌ కార్యదర్శి ప్రభాకర్‌ తెలిపారు. కలెక్టరేట్‌ వరకు జరిగిన ర్యాలీ ప్రదర్శన కారణంగా రాజవిహార్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు.

Updated Date - Feb 12 , 2026 | 11:46 PM