అభివృద్ధికి దూరంగా కర్నూలు
ABN , Publish Date - Oct 25 , 2026 | 11:51 PM
విభజన తరువాత కర్నూలు తీవ్ర వివక్షకు గురైందని, అభివృద్ధికి దూరంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): విభజన తరువాత కర్నూలు తీవ్ర వివక్షకు గురైందని, అభివృద్ధికి దూరంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని సుందరయ్య భవన్‌లో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ జోన్లు, కారిడార్లు అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్నారు. వైసీపీ గొడ్డలి పార్టీ అంటూనే టీడీపీని కత్తుల పార్టీగా మార్చుకున్నారని అన్నారు. 13 జిల్లాలో నామినేషన్లు వేయలేని పరిస్థితి ఉందని డీజీపీనే స్వయంగా చెప్పారని, లోకేశ్ నుంచే ఎమ్మెల్యేలకు ఆదేశాలు వస్తున్నాయని, ఇవి ఆర్గనైజ్డ్ క్రైం కాదా అని ప్రశ్నించారు. ఇక ఎన్నికల్లో ఓటు స్వేచ్ఛగా వేయనిస్తారా? అని సందేహం వ్యక్తం చేశారు. డబ్బులు, కులం, మతం పేరుతో ఓటర్లను మభ్యపెట్టాలని టీడీపీ, వైసీపీ చూస్తున్నాయని ఆరోపించారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.రామాంజనేయులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి డి.గౌ్‌సదేశాయ్, సీపీఐ జిల్లా కార్యదర్శి మునెప్ప తదితరులు పాల్గొన్నారు.