Share News

కర్నూలు మార్కెట్‌ యార్డు రికార్డు

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:27 PM

కర్నూలు మార్కెట్‌ యార్డు సరికొత్త రికార్డును నమోదు చేసింది. దాదాపు 13 రకాల పంట ఉత్పత్తులను రైతులు ఈ మార్కెట్‌ యార్డుకు అమ్మకానికి తెచ్చారు.

కర్నూలు మార్కెట్‌ యార్డు రికార్డు
కర్నూలు యార్డులోకి విక్రయానికి వచ్చిన ఎండుమిర్చి

13 రకాల పంట ఉత్పత్తుల విక్రయాలు

కర్నూలు అగ్రికల్చర్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మార్కెట్‌ యార్డు సరికొత్త రికార్డును నమోదు చేసింది. దాదాపు 13 రకాల పంట ఉత్పత్తులను రైతులు ఈ మార్కెట్‌ యార్డుకు అమ్మకానికి తెచ్చారు. రాష్ట్రంలోనే అన్ని రకాల పంట ఉత్పత్తుల విక్రయాలు ఎక్కడా జరగడం లేదు. వేరుశనగ కాయలు, ఎండుమిర్చి, కందులు, వాము, మొక్కజొన్న, మొత్తం 13 రకాల పంట ఉత్పత్తులు కర్నూలు మార్కెట్‌ యార్డులో ప్రతి రోజు విక్రయాలు జరుగుతున్నాయి. 26 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈయార్డులో ఇన్ని రకాల పంట ఉత్ప త్తులను తీసుకువస్తుండటంతో స్థలాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇటీవల మార్కెట్‌ యార్డుకు పక్కనే ఉన్న ఏపీఎస్‌పీ బెటాలియన్‌లో ఉన్న ఖాళీ స్థలాన్ని మార్కెట్‌ యార్డుకు వినియోగించేందుకు అవకాశం కల్పించాలని మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌కు అధికారు లు లెటరు రాశారు. మంత్రి టీజీ భరత్‌ ద్వారా ప్రయత్నం చేయాలని నిర్ణయించారు.

బెటాలియన్‌ ఖాళీ స్థలాన్ని కేటాయించాలి

ప్రస్తుతం 13 రకాల పంట ఉత్పత్తులు కర్నూలు మార్కెట్‌ యార్డుకు రైతులు విక్రయానికి తీసుకువస్తున్నారు. స్థలం సమస్య వేధిస్తోంది. ఏడాది పొడువునా పంట ఉత్పత్తుల విక్ర యాలు జరుగుతున్నాయి. పంట ఉత్పత్తులను నిల్వ తీసుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌ కమిటీ పాలకవర్గంతో కలిసి ఏపీఎస్‌పీ బెటాలియన్‌ స్థలాన్ని యార్డు కోసం కేటాయించాలంటూ ప్రభుత్వానికి నివేదిక పంపాం.

జయలక్ష్మి, సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ, కర్నూలు

Updated Date - Mar 03 , 2026 | 11:27 PM