‘ఉస్మానియా’లో జిల్లా ఆవిర్భావ దినోత్సవం
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:20 AM
:స్థానిక ఉస్మానియా కళాశా లలో కర్నూలు జిల్లా 168వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. జిల్లా మేధావుల వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమా నికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సమీయుద్దీన్ ముజమ్మిల్ అధ్యక్షతన వహించారు.
కర్నూలు కల్చరల్, జూలై 1(ఆంధ్రజ్యోతి):స్థానిక ఉస్మానియా కళాశా లలో కర్నూలు జిల్లా 168వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. జిల్లా మేధావుల వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమా నికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సమీయుద్దీన్ ముజమ్మిల్ అధ్యక్షతన వహించారు. కరస్పాండెంట్ ఆజ్రా జావేద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మన చరిత్ర, సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డాక్టర్ సమియుద్దీన్ మజుమ్మిల్ మాట్లాడుతూ జిల్లా చరిత్ర, సంస్కృతి ఎంతో విశిష్టమైందన్నారు. జిల్లా మేధావుల వేదిక అధ్యక్షుడు ఆచార్య మన్సూర్ రెహమాన్ మాట్లాడుతూ ప్రథమ స్వాతంత్య్ర పోరాటానికి 57 ఏళ్ల పూర్వమే మూడు గొప్ప తిరుగుబాట్లు జరిగాయని గుర్తు చేశారు. సామాజికవేత్త కేసీ కల్కూర మాట్లాడుతూ ఉస్మానియా కళాశాలలో తాను పూర్వ విద్యార్థినని, ఇక్కడ జవహర్‌లాల్ నెహ్రూ, రాజేంద్రప్రసాద్, జాకీర్ హుస్సేన్ , విశ్వనాథ సత్యనారాయణ వంటి ప్రముఖులు విచ్చేశారని చెప్పారు. కరస్పాండెంట్ ఆజ్రాజావేద్‌ను కేసీ కల్కూర సన్మానించారు. అలాగే కేసీ కల్కూరను ‘ది ప్రైడ్ ఆఫ్ కర్నూలు’ పురస్కారంతో సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల చరిత్ర విభాగాధిపతి మసూద్ అహ్మద్, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి షేక్ గౌస్, క్లస్టర్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ అక్తర్ భాను, ముచ్చుకోట చంద్రశేఖర్, డాక్టర్ రమణయ్య, డాక్టర్ సలీం బాషా, జేఎస్‌ఆర్‌కే శర్మ, జంధ్యాల రఘుబాబు, పాపారావు, రాముడు పాల్గొన్నారు.