బానకచెర్లను సందర్శించిన కేఆర్‌ఎంబీ బృందం
ABN , Publish Date - Apr 22 , 2026 | 11:32 PM
మండలంలోని బానకచెర్ల క్రాస్ హెడ్ రెగ్యులేటర్‌ను కేఆర్‌ఎంబీ బృందం సందర్శించింది.
పాములపాడు, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని బానకచెర్ల క్రాస్ హెడ్ రెగ్యులేటర్‌ను కేఆర్‌ఎంబీ బృందం సందర్శించింది. బుదవారం కేఆర్‌ఎంబీ చైర్మైన్ సుబ్రాంగ్ బిశ్వాస్, బోర్డు మెంబర్ జాంగిడ్, డిఈ పవన్ ఈఈ రవిచంద్ర వారి బృందం డీఈ, ఈఈ, ఏఈలతో సమావేశమై పోతిరెడ్డిపాడు నుండి ఎంత నీరు బానకచెర్ల హెడ్ రెగ్యులేటర్‌కు వస్తోంది? ఇక్కడి నుండి వీబీఆర్, జీఎన్‌ఎస్‌ఎస్, కేసీసీకి ఈ ఏడాది ఇప్పటి వరకు ఎంత నీరు విడుదల చేశారు? తదితర అంశాలపై చర్చించారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్..
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను బుధవారం కృష్ణానది యాజమాన్య బోర్డు బృందం పరిశీలిం చింది. కమిటీ చైర్మన్ సుబ్రాంగ్‌షూబిశ్వాస్ ప్రాజెకు విశిష్టత, నీటిలభ్యత, దిగువ ప్రాంతానికి నీటి విడుదల తదితర అంశాల గురించి నీటి పారుదలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, గేట్ల సామర్థ్యం, అప్రోచ్ కాల్వ, ఎస్సార్‌ఎంసీ కాల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదలశాఖ ఎస్‌ఈ శివశంకరరెడ్డి, డీఈలు సుబ్రహ్మణ్యంరెడ్డి, నగేష్, ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి , నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.