జలాశయాన్ని పరిశీలించిన కేఆర్‌ఎంబీ
ABN , Publish Date - Apr 21 , 2026 | 10:53 PM
శ్రీశైలం జలాశయాన్ని మంగళవారం కేఆర్‌ఎంబీ బృందం పరిశీలించింది.
విద్యుదుత్పత్తికి వినియోగించిన నీటి నిల్వలపై ఆరా
కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల పరిశీలన
ఇరు రాష్ట్రాల ఇరిగేషన్, జెన్కో అధికారులతో ప్రత్యేక సమావేశం
శ్రీశైలం, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయాన్ని మంగళవారం కేఆర్‌ఎంబీ బృందం పరిశీలించింది. ఈ సంద ర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల జల విద్యుత్ కేంద్రాల్లో ఏడా ది కాలం నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్, దానికి వినియోగిం చిన నీటి నిల్వల వివరాలను కేఆర్‌ఎంబీ బృందం పక్కాగా తెలుసు కున్నారు. కొంత కాలంగా నీటి నిల్వల వినియోగంపై ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయ వాగ్వివాదం చోటుచేసుకున్న నేపథ్యం లో కృష్ణా బోర్డు బృందం సందర్శన గమనార్హం. మంగళవారం కేఆర్‌ఎంబీ చైర్మన్ సుబ్రాంగ్ షూ బిశ్వాస్, సభ్యులు జంగిడ్, డీఈఈ జి. పవన్నాథ్ ఆనకట్టను సందర్శించి రిజర్వాయర్ సామర్థ్యం, గరిష్ఠ స్థాయి నీటి నిల్వ, ప్రస్తుత నీటి నిల్వతోపాటు క్రస్ట్‌గేట్లు, లిఫ్టింగ్ రోప్స్, గ్యాలరీ, ఫ్లంజ్‌పూల్ వంటి కీలక అంశాలను పరిశీలించి అధికారులతో సమగ్ర నివేదికలు తీసుకున్నారు. అదే విధంగా ఫ్లంజ్‌పూల్ పనులు చేపట్టేందుకు వేస్తున్న అప్రోచ్ రోడ్డు పనులను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వ్యూపాయింట్‌లో ఉన్న డ్యాం నమూనాను పరిశీలించి ఇరు రాష్ట్రాల ఇరిగేషన్, జెన్కో అధికారులతో సమావేశం నిర్వహిం చారు. అనంతరం కుడి ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలను సందర్శించి డిమాండ్‌కు తగినట్లుగా విద్యుదుత్పత్తి విధానాలు, నీటి వినియోగం, ఉత్పత్తి చేసిన యూనిట్లపై ఇరు రాష్ట్రాల జెన్కో అధికారులతో వివరాలు సేకరించుకున్నారు. ఎడమ గట్టు విద్యుతోత్పత్తి కేంద్రంలో పంప్ 2 మోడ్ పద్ధతితో నీటి దుర్వినియోగం చెందకుండా వాటర్ రీ యూజ్ విధానం అమలు ఎలా జరుగుతున్నదీ తెలుసుకున్నారు. అదే విధంగా కొద్ది మాసాల క్రితం కుప్పకూలిపోయిన ఎస్‌ఎల్‌బీసీ టన్నల్‌ను పరిశీ లించి అటునుంచి పోతిరెడ్డిపాడు, కర్నూలు ప్రాంతాలను సంద ర్శించనున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.