Share News

నేడు శ్రీశైలంలో కోటి దీపోత్సవం

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:25 AM

శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసం ఏకాదశి పర్వదినం రోజున భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు దీప నీరాజనాలు సమర్పించుకునే కోటి దీపోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ పోతుగుంట రమేశ్‌నాయుడు తెలిపారు.

నేడు శ్రీశైలంలో కోటి దీపోత్సవం
శ్రీశైలంలో కోటి దీపోత్సవం ఏర్పాట్లు

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

భక్తులు స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ప్రత్యేక ఆహ్వానం

శ్రీశైలం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసం ఏకాదశి పర్వదినం రోజున భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు దీప నీరాజనాలు సమర్పించుకునే కోటి దీపోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ పోతుగుంట రమేశ్‌నాయుడు తెలిపారు. శుక్రవారం సాయంత్రం శివాజీ స్ఫూర్తి కేంద్రం ఎదురుగా ఉన్న విశాలమైన మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తేన్న ఇలకైలాసం వేదికపై స్వామిఅమ్మవార్లకు షోడశోపచార పూజా క్రతువులు, దశవిధ హారతులను అర్చక వేదపండితులచే నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం 6 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాటు ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు నాగూర్‌బాబు (మనో) బృందంతో భక్తి సంగీత స్వరార్చన కార్యక్రమాలను వైభవంగా జరిపించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు స్వచ్ఛందంగా పాల్గొని దీపాలు వెలిగించుకునేలా దేవస్థానం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Updated Date - Nov 20 , 2026 | 12:25 AM