Share News

కన్నుల పండువగా కోసిగయ్య రథోత్సవం

ABN , Publish Date - May 01 , 2026 | 11:06 PM

స్థానిక 3వ వార్డులో వెలిసిన ఆంజనేయ(కోసిగయ్య స్వామి)స్వామి బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం కోసిగయ్య స్వామి మహా రథోత్సవం భక్తుల సమక్షంలో కన్నుల పండుగగా జరిగింది.

కన్నుల పండువగా కోసిగయ్య రథోత్సవం
కోసిగయ్య స్వామి రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

కోసిగి, మే 1(ఆంధ్రజ్యోతి): స్థానిక 3వ వార్డులో వెలిసిన ఆంజనేయ(కోసిగయ్య స్వామి)స్వామి బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం కోసిగయ్య స్వామి మహా రథోత్సవం భక్తుల సమక్షంలో కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ఈవో సాయికుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నూతన వధు, వరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సీఐ మంజునాథ, ఎస్‌ఐ రమేష్‌ రెడ్డి గట్టి పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - May 01 , 2026 | 11:06 PM