Share News

భర్తకు కిడ్నీ దానం..

ABN , Publish Date - Feb 03 , 2026 | 01:04 AM

మెడికవర్‌ హాస్పిటల్‌లో అయిదో కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. వివరాల మేరకు.. ఎస్‌.రవీంద్రకు (46)కు భార్య కే.పద్మావతి(40) కిడ్నీ దానం చేసింది. నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామానికి చెందిన ఎస్‌.రవీంద్ర రెండు కిడ్నీలు చిన్నవి కావడంతో పనితీరు తగ్గంది.

భర్తకు కిడ్నీ దానం..
రోగితో మెడికవర్‌ హాస్పిటల్‌ వైద్యులు

మెడికవర్‌లో ఆపరేషన్‌

కర్నూలు హాస్పిటల్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): మెడికవర్‌ హాస్పిటల్‌లో అయిదో కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. వివరాల మేరకు.. ఎస్‌.రవీంద్రకు (46)కు భార్య కే.పద్మావతి(40) కిడ్నీ దానం చేసింది. నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామానికి చెందిన ఎస్‌.రవీంద్ర రెండు కిడ్నీలు చిన్నవి కావడంతో పనితీరు తగ్గంది. భార్య పద్మావతి కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రావడంతో మెడికవర్‌ వైద్యులు ఆపరేషన్‌ చేశారు. పూర్తిగా దెబ్బతిన్న కుడి కిడ్నీని ల్యాప్రోస్కోపిక్‌ ద్వారా తొలగించారు. ఈ శస్త్ర చికిత్సను రెట్రోపెరిటోనియల్‌ నెఫ్రక్టమీ అనే అత్యంత అరుదైన ఆపరేషన్‌ను రాయలసీమలో తొలిసారిగా నిర్వహించినట్లు యూరాలజీ కన్సల్టెంట్‌ డా.అబ్దుల్‌ సమద్‌, నెఫ్రాలజిస్టు డా.సిద్దార్థ హెరూర్‌ తెలిపారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటంతో సోమవారం డిశ్చార్జ్‌ చేసినట్లు హాస్పిటల్‌ హెడ్‌ వై.మహేశ్వరరెడ్డి తెలిపారు.

Updated Date - Feb 03 , 2026 | 01:04 AM