Share News

కిడ్నాప్‌ కలకలం!

ABN , Publish Date - Oct 16 , 2026 | 12:02 AM

నగరంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, జియాలజిస్టు కిడ్నాప్‌ ఉదంతం కలకలం రేపింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కొడుకు రామ్మోహన్‌ రెడ్డి ఆయన సమీప బంధువు వంశీధర్‌ రెడ్డి హైదరాబాదు చెందిన ఓ వ్యాపారితో కలిసి డోన్‌ నియోజకవర్గంలో ఓ మైనింగ్‌ వ్యాపారం నిర్వహించినట్లు సమాచారం. వీరి మధ్య చాలా మేరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయి.

 కిడ్నాప్‌ కలకలం!

పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే కొడుకు, బంధువు

కర్నూలు క్రైం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): నగరంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, జియాలజిస్టు కిడ్నాప్‌ ఉదంతం కలకలం రేపింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కొడుకు రామ్మోహన్‌ రెడ్డి ఆయన సమీప బంధువు వంశీధర్‌ రెడ్డి హైదరాబాదు చెందిన ఓ వ్యాపారితో కలిసి డోన్‌ నియోజకవర్గంలో ఓ మైనింగ్‌ వ్యాపారం నిర్వహించినట్లు సమాచారం. వీరి మధ్య చాలా మేరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయి. ఐదేళ్ల క్రితం కొవిడ్‌ సమయంలో ఆ వ్యాపారి కరోనాతో మృతి చెందాడు. అయితే వీరికి సుమారు రూ.2 కోట్ల మేర అప్పుగా ఉన్నట్లు సమాచారం. ఆ వ్యాపారి కొడుకు భరత్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అప్పు మొత్తాన్ని చెల్లించేందుకు హామీ ఇచ్చాడు. ఈ ఐదేళ్ల కాలంలో ఆ అప్పు మొత్తం రూ.3 కోట్ల దాకా చేరింది. ఇందులో రూ.2 కోట్ల మేర చెల్లించినా మరో రూ.కోటి దాకా అప్పుగా ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో వైజాగ్‌కు చెందిన సత్యనారాయణ అనే జియాలజిస్టు మధ్యవర్తిగా ఉన్నాడు. భరత్‌ రూ.కోటి మొత్తాన్ని చెల్లించకపోవడంతో రామ్మోహన్‌ రెడ్డి అనుచరులు భరత్‌ను హైదరాబాదు నుంచి కర్నూలుకు తీసుకువచ్చారు. అలాగే వైజాగ్‌లో ఉన్న సత్యనారాయణను పిలిపించి అక్రమంగా నిర్భందించినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని చెల్లించాలని పట్టుబట్టడంంతో పోలీసులకు రహస్యంగా సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రామ్మోహన్‌ రెడ్డితో పాటు మరి కొంత మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ పూర్తి ఆర్థిక లావాదేవీలపై, కిడ్నాప్‌ వ్యవహారంపై పూర్తి స్థాయిలో అంతర్గతంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే కిడ్నాప్‌ వ్యవహారంపై పోలీసులు ఎవరూ స్పందించడం లేదు.

Updated Date - Oct 16 , 2026 | 12:02 AM