Share News

కీర్తి మెడికల్‌ స్టోర్స్‌ ఏర్పాటు

ABN , Publish Date - Mar 09 , 2026 | 12:03 AM

రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కడా లేని విధంగా అన్ని రకాల మెడిసిన్లు కీర్తి మెడికల్‌ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు

కీర్తి మెడికల్‌ స్టోర్స్‌ ఏర్పాటు
ప్రారంభిస్తున్న ఎంపీ నాగరాజు

కర్నూలు కల్చరల్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కడా లేని విధంగా అన్ని రకాల మెడిసిన్లు కీర్తి మెడికల్‌ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. ఆదివారం బుధవారపేటలో ఏర్పాటుచేసిన కీర్తి మెడికల్‌ స్టోర్స్‌ను ఆయన ప్రారంభించారు. మెడికల్‌ స్టోర్‌లోని మూడు అంతస్తుల్లో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను ఆయన పరిశీలించారు. ఆయా విభాగాల ద్వారా చేపట్టిన విక్రయాలను అడిగి తెలుసుకున్నారు. మరో అతిఽథి, బేబీకేర్‌ విభాగాన్ని ప్రారంభించిన గుంటూరు జనని గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్‌ వైద్యురాలు డాక్టర్‌ ముక్కు కవిత మాట్లాడుతూ ఒకే స్టోర్స్‌లో మెడిసిన్‌, సర్జికల్‌, బేబీకేర్‌ ఏర్పాటుతో వినియోదారులకు ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. కీర్తి మెడికల్‌ స్టోర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ లోకిరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ కీర్తి మెడికల్‌ స్టోర్స్‌ను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు వివిధ జిల్లాల్లో 25 ఏర్పాటు చేశామని తెలిపారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కీర్తి మెడికల్‌ స్టోర్స్‌ ఎండీ లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఆవుల రాఘవరెడ్డి, కంది పేరి రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2026 | 12:03 AM