Share News

సమస్యాత్మక పీఎస్‌లపై నిఘా పెట్టండి

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:21 AM

స్థానిక ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మకమైన పోలింగ్‌ స్టేషన్లపై(పీఎస్‌) ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ విక్రాంత పాటిల్‌ అన్నారు.

సమస్యాత్మక పీఎస్‌లపై నిఘా పెట్టండి
జులకల్లులో పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ విక్రాంత పాటిల్‌

ఎస్పీ విక్రాంత పాటిల్‌

సి.బెళగల్‌, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మకమైన పోలింగ్‌ స్టేషన్లపై(పీఎస్‌) ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ విక్రాంత పాటిల్‌ అన్నారు. శుక్రవారం మండ లంలోని సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాలైన పోలకల్‌ రెగ్యులర్‌, స్పెషల్‌ పాఠశాలల కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మండలంలోని బ్రాహ్మణ దొడ్డి, బూరందొడ్డి, మారం దొడ్డి, కంబదహాల్‌, సి.బెళగల్‌, కొత్తకోట, కొండా పురం గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని కోడు మూరు సీఐ తబ్రేజ్‌, ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజులకు ఆదేశించారు. గ్రామాల్లో ఎక్క డైనా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, ఫొటోలు కనిపిస్తే తొలగించాల న్నారు. మండలంలోని రౌడీషీటర్ల వివరాలు అడిగి తెలసుకున్నారు. ఆయన వెంట కోడుమూరు సీఐ తబ్రేజ్‌, ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు, పోలీసు సిబ్బంది ఉన్నారు.

గూడూరు: ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకు నేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ విక్రాంత పాటిల్‌ ఆదేశించారు. శుక్రవారం గూడూరు పోలీస్‌ స్టేషన పరిధిలోని గూడూరు, జులకల్లు గ్రామంలో పోలింగ్‌ కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. ఆయన మాట్లా డుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట కోడుమూరు సీఐ తబ్రేజ్‌, గూడూరు ఎస్‌ఐ రాజా కుళ్ళాయప్ప, సి బెళగల్‌ ఎస్‌ఐ వేణుగోపాల రాజు ఉన్నారు.

Updated Date - Oct 17 , 2026 | 12:21 AM