కాలువలు ఇలా.. నీరు పారేదెలా?
ABN , Publish Date - May 11 , 2026 | 12:03 AM
మండలంలోని కేసీ కాలువ పంట కాలువల సైడ్‌వాళ్లు, లైనింగ్ దెబ్బతిన్నాయి. చాలాచోట్ల పిచ్చి మొక్కలు ఉండటంతో నీరు వచ్చినా ముందుకు పారే అవకాశం లేదు.
అధ్వానంగా కేసీ పంట కాలువలు
జలధార కింద బాగుచేయాలని రైతుల వినతి
చాగలమర్రి, మే 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కేసీ కాలువ పంట కాలువల సైడ్‌వాళ్లు, లైనింగ్ దెబ్బతిన్నాయి. చాలాచోట్ల పిచ్చి మొక్కలు ఉండటంతో నీరు వచ్చినా ముందుకు పారే అవకాశం లేదు. మండల కేంద్రంలోని కూలూరు రహదారిలో కేసీ ప్రధాన కాలువ నుంచి ఆయకట్టుకు సాగునీరందించే పిల్ల కాలువల నిర్వహణ లేకపోవడంతో ఇలా తయారయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీతో ప్రధాన కాలువ నుంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం ప్ర్నార్థకంగా మారింది. నీరు సరిగా అందకపోవడంతో 1,500 ఎకరాల్లో రైతులు వరి పంటను వదిలేసి ఆరుతడి పంటలను సాగు చేస్తున్నారు. ఈ ఏడాదైన పంట కాలువల మరమ్మతులు చేసి చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జలధార-జలహారతి కింద నీటి సంరక్షణకు పెద్దపీట వేస్తూ వంద రోజుల ప్రణాళిక తీసుకువంచ్చింది. ఈ పథకంలో భాగంగా పంట కాలువలకు మరమ్మతులు చేసి, సాగునీరందేలా చూడాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.