కాటసానికి మతిభ్రమించింది
ABN , Publish Date - Aug 11 , 2026 | 10:52 PM
కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక కాటసాని రాంభూపాల్ రెడ్డికి మతిభ్రమించినట్లు ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.
రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
కోవెలకుంట్ల, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక కాటసాని రాంభూపాల్ రెడ్డికి మతిభ్రమించినట్లు ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో రహదారులను వేయిస్తున్నామన్నారు. మంగళవారం కోవెలకుంట్ల మండల పరిధిలోని అమడాల, సౌదరదిన్నె గ్రామాల్లో మంత్రి పర్యటించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఉనికిని కాపాడుకునేందుకు డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, మంత్రి నారా లోకేష్ రాజీమానా చేయాలంటూ దీక్షలు చేయడం సిగ్గగ చేటన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్ధల ఎన్నికల్లో అభివృద్ధి చేసే పార్టీకి ప్రజలు మద్దతు పలుకుతారని తెలిపారు. ఇదిలా ఉండగా గ్రామాలకు సరైన వేళకు బస్సులు రావడం లేదని మహిళలు, విద్యార్థులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో వెంటనే కోవెలకుంట్ల డిపో మేనేజర్‌తో మాట్లాడిన మంత్రి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అమడాల మద్దిలేటి, సౌదరదిన్నె వెంకట సుబ్బారెడ్డి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు శ్రీనిధి మద్దిలేటి, ధనుంజయుడు, హుస్సేనయ్య, బుచ్చన్న, బాలరాజు, జగదీశ్వర్ రెడ్డి, నరసింహారెడ్డి, ఏవి సుబ్బారెడ్డి, సునీల్ రెడ్డి, పీఆర్ డీఈ నాగశ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.