Share News

శ్రీశైలంలో వైభవంగా కార్తీక మాసోత్సవాలు

ABN , Publish Date - Nov 21 , 2026 | 11:20 PM

శ్రీశైల క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు శనివారం తెల్లవారుజామున అర్చకులు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు.

శ్రీశైలంలో వైభవంగా కార్తీక మాసోత్సవాలు
శ్రీశైలంలో కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు

శ్రీశైలం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు శనివారం తెల్లవారుజామున అర్చకులు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉభయ దేవాలయాల్లో భక్తులు ఆదిదంపతులను అలంకార దర్శనాలు చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ధి ద్వాదశి రోజున సాయంత్రం తులసీదేవి ప్రత్యేక పూజలను మహిళలు శాస్త్రోక్తంగా నిర్వహించుకుని సుమంగళిగా ఆయురారోగ్యాలతో బాసిల్లాలని అమ్మవారిని కాంక్షిస్తూ తాంబూలాలు ఇచ్చుకుంటారని దేవస్థానం ఆస్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు. ఆలయ మాడవీధి శివాజీ గోపురం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉసిరి తులసి మొక్కలకు భక్తులు ప్రత్యేక పూజలు చేసుకుని కార్తీక దీపాలు వెలిగించారు.

Updated Date - Nov 21 , 2026 | 11:20 PM