Share News

భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవం

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:14 AM

నగరంలో కార్తీక తొలి సోమవారం సందర్భంగా భక్తులు కార్తీక దీపోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.

భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవం
సత్యనారాయణ స్వామి ఆలయంలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు

కర్నూలు కల్చరల్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): నగరంలో కార్తీక తొలి సోమవారం సందర్భంగా భక్తులు కార్తీక దీపోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కావడంతో శైవ, వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాయి. నగరంలోని కేసీ కెనాల్‌ సమీపంలో గల సత్యనారాయణ స్వామి ఆలయం, వనటౌనలోని శివాలయం, జమ్మిచెట్టు సమీపంలోని లలితా పీఠం, నెహ్రూనగర్‌లోని సత్యసాయి మందిరం, అశోక్‌ నగర్‌లోని అభయాంజనేయస్వామి ఆలయం, సంకల్‌భాగ్‌లోని హరిహర క్షేత్రాలలో సోమవారం సాయంత్రం భక్తుల సందడి కానవచ్చింది. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు.

శివనామస్మరణతో మార్మోగిన కాల్వబుగ్గ

ఓర్వకల్లు: మండలంలోని కాల్వబుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. కార్తీక తొలి సోమవారం కావడంతో ఉమ్మడి జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శివుడికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీకదీపాలు వెలిగించి ఉసిరిచెట్టుకు పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లను పల్లకిలో ఉంచి ఆలయం చుట్టూ ఊరేగించారు. స్వామి, అమ్మవార్లకు ఆలయ ప్రధాన అర్చకులు కల్లె లక్ష్మీనారాయణ శర్మ, కల్లె లక్ష్మీనరసింహ శర్మ ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ఈవో మద్దిలేటి, ఆలయ చైర్మన కాటినేని నారాయణ, ధర్మకర్తల ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించారు. కార్యక్రమంలో భక్తులు, మహిళలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2026 | 12:14 AM