24న వినాయక ఘాట్లో కార్తీక దీపోత్సవం
ABN , Publish Date - Nov 21 , 2026 | 11:49 PM
నగరంలోని కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో ఈనెల 24న కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మహిళలతో సామూహిక కార్తీక లక్ష దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత ముఖ్య అతిథిగా విచ్చేస్తారని దీపోత్సవ సమితి కార్యాధ్యక్షు రాలు ఇ.పద్మావతి, ఉపాధ్యక్షురాలు విశాలాక్ష్మమ్మ, కార్యదర్శులు కే స్వప్నసారధి, మహాలక్ష్మి, జయలక్ష్మి, రజనీ కల్కూర తెలిపారు.
శివపార్వతుల కల్యాణ వేడుకలు
ముఖ్య అతిథిగా మంత్రి టీజీ భరత రాక
కర్నూలు కల్చరల్, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): నగరంలోని కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో ఈనెల 24న కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మహిళలతో సామూహిక కార్తీక లక్ష దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత ముఖ్య అతిథిగా విచ్చేస్తారని దీపోత్సవ సమితి కార్యాధ్యక్షు రాలు ఇ.పద్మావతి, ఉపాధ్యక్షురాలు విశాలాక్ష్మమ్మ, కార్యదర్శులు కే స్వప్నసారధి, మహాలక్ష్మి, జయలక్ష్మి, రజనీ కల్కూర తెలిపారు. శనివా రం కలెక్టరేట్ సమీపంలోని సాలమ్మ సత్రంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశం వారు దీపోత్సవ వేడుకల వివరాలు తెలిపే కరపత్రాలు విడుదల చేశారు. వారు మాట్లాడుతూ పదకొండేళ్లుగా ఏటా కార్తీక పౌర్ణమి రోజున నగరంలోని కేసీ కెనాల్ వినాయక ఘాట్ వద్ద మహిళ లతో సామూహికంగా దీపోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సహకారంతో జరిగే ఈ దీపోత్సవ వేడుకలు 24నసాయంత్రం 4గంటలకు ప్రారం భమవుతా యని తెలిపారు. సప్తగిరినగర్లోని అయ్యప్ప స్వామి ఆలయం నుంచి వినాయక ఘాట్ వరకు శివపార్వతుల రథం ఊరేగింపు ఉంటుందని, కేసీ వినాయక ఘాట్పై 5 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 5 గంటలకు చిన్మ య మిషన ఆథ్యాత్మిక గురువు సుప్రేమానంద స్వామినిచే జ్యోతి ప్రజ్వలన, సాయంత్రం 5.30 గంట లకు ఆకాశదీప ప్రజ్వలనము, సాయంత్రం 6 గంటల కు శివపార్వతులకు అభిషేకం, శివపార్వతుల కల్యాణ వేడుకలు ఉంటా యని తెలిపారు.
సత్యనారాయణ స్వామి ఆలయంలో దీపోత్సవాలు
ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కేసీ కెనాల్లో నీటి లభ్యత లేనందున వినాయక ఘాట్ వద్ద శివపార్వతుల కల్యాణం, సాంస్కృ తిక కార్యక్రమాలు నిర్వహిస్తారని, దీపోత్సవాలు ఘాట్ ఎదురుగా ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసినట్లు పద్మావతి తెలిపారు.